Share News

Viral: ఇలాంటి సీన్ చూడాలంటే పెట్టిపుట్టాలి.. అద్భుత వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా!

ABN , Publish Date - Apr 27 , 2024 | 05:02 PM

మహారాష్ట్రలోని అత్యంత ఎత్తైన పర్వతంపై దృశ్యాల తాలుకు వీడియోను ఆనంద్ మహీంద్రా తాజాగా షేర్ చేశారు. వీడియోలోని ప్రకృతి అందాలు చూసి జనాలు మైమరిచిపోతున్నారు. బిజీ జీవితానికి బ్రేక్ ఇచ్చి ఇలాంటి దృశ్యాలు ఆస్వాదించాలని మహీంద్రా సూచించారు.

Viral: ఇలాంటి సీన్ చూడాలంటే పెట్టిపుట్టాలి.. అద్భుత వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా!

ఇంటర్నెట్ డెస్క్: డబ్బు యావలో పడి మనిషి ఎన్నో కోల్పోతున్నాడు. కెరీరే పరమావధిగా బతికేస్తూ ఎన్నో అనుభూతులు, ఆనందాలకు దూరమవుతున్నాడు. కనీసం చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను కూడా ఆశ్వాదించలేకపోతున్నాడు. ఇలాంటి ఉరుకుల పరుగుల జీవితం గడిపేవారికి కెరీర్ ఆవల ఏ ముందో చెబుతూ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఓ వీడియో నెట్టింట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరల్ (Viral) అవుతోంది.

మహారాష్ట్రలోని (Maharashtra) అత్యంత ఎత్తైన పర్వతం కాల్సూబాయ్ వీడియోను ఆయన షేర్ చేశారు. పర్వతంపై నుంచి మెట్ల దారి ద్వారా కిందకు దిగుతుండగా ఈ వీడియోను రికార్డు చేశారు. పర్వతాన్ని తాకుతున్నట్టు ఉన్న మేఘాలు, వాటి ఆవల మెరుస్తున్న సూర్యుడు వెరసి ఆ ప్రాంతమంతా మరో ప్రపంచంలా ఉంటుంది. ప్రకృతి సౌందర్యం ఎంత గొప్పదో ఇట్టే అర్థమవుతుంది. ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు (Video of Mt.Kalsubai).

Viral: ఇలాంటి షాకులిస్తే చాలు.. ఇంకెప్పుడూ పబ్లిక్ ప్లేసుల్లో రీల్స్ చేయరు!


‘‘ఇది మహారాష్ట్రలోని కాల్సూబాయ్ పర్వతం. ఇగత్‌పురిలో మా ఇంజన్ ఫ్యాక్టరీకి దగ్గర్లో ఉందిది. ఇగత్‌పురికి చాలా సార్లు వెళ్లాను కానీ పర్వతంపై ఉన్న ఈ ప్రదేశం గురించి నెనెప్పుడూ వినలేదు. ఇలాంటి అద్భుత దృశ్యాల్ని చూసేందుకు, ఆస్వాదించేందుకు ఉరుకుల పరుగుల జీవితం నుంచి కాస్త బ్రేక్ తీసుకోవాలి’’ అని ఆయన సూచించారు.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో జనాలకు తెగ నచ్చడంతో ఇది వైరల్‌గా మారింది. ఇప్పటికే 4 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అనేక మంది ఈ సీన్ చూసి మైమరచిపోయారు. ప్రకృతి సౌందర్యానికి సాటి రాగాలదని మరేదీ లేదని కామెంట్ చేశారు. బిజీ జీవితంలో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నామని, ఇలాంటి ప్రదేశాలకు వెళ్లాలంటే అదృష్టం ఉండాలేమో అంటూ కొందరు నిరాశ వ్యక్తం చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.

Read Viral and Telugu News

Updated Date - Apr 27 , 2024 | 05:10 PM