Share News

Viral Video: ఆంటీ.. రోడ్డు మీద ఈ పని ఏంటి? వర్షంలో నడిరోడ్డుపై డ్యాన్స్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

ABN , Publish Date - Aug 21 , 2024 | 11:09 AM

వర్షంలో ఎంజాయ్ చేస్తూ రోడ్డు మీద డ్యాన్స్‌ చేస్తున్న ఓ మహిళకు సంబంధించిన వీడియో చాలా మందికి ఆగ్రహం తెప్పిస్తోంది. వేగంగా వెళ్తున్న వాహనాలను పట్టించుకోకుండా ఆమె రీల్స్ కోసం డ్యాన్స్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: ఆంటీ.. రోడ్డు మీద ఈ పని ఏంటి? వర్షంలో నడిరోడ్డుపై డ్యాన్స్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..
Rain Dance

ప్రస్తుతం వర్షాకాలం కావడంతో దేశవ్యాప్తంగా వర్షాలు (Rains) పడుతున్నాయి. ఎన్నో లోతట్టు ప్రాంతాలు వరదలతో అతలాకుతలమయ్యాయి. ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అలాంటి ఎన్నో హృదయ విదారక వీడియోలు సోషల్ మీడియా ద్వారా అందరినీ చేరుతున్నాయి. అదే సమయంలో వర్షంలో ఎంజాయ్ చేస్తూ రోడ్డు మీద డ్యాన్స్‌ చేస్తున్న ఓ మహిళకు సంబంధించిన వీడియో చాలా మందికి ఆగ్రహం తెప్పిస్తోంది. @Nishantjournali అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో రోడ్డు పక్కన ఆపి ఉన్న కారుపై ఓ మహిళ కూర్చుని ఉంది. ఆ సమయంలో వర్షం పడుతోంది. ఆమె కారు నుంచి కిందకు దూకి వర్షంలో డ్యాన్స్ (Rain Dance) చేయడం ప్రారంభించింది. ఆమె పక్క నుంచి వేగంగా వాహనాలు వెళ్లిపోతున్నాయి. రోడ్డు మధ్యలో ఆమె డ్యాన్స్ చేస్తుండడం చాలా మందికి ఆగ్రహం కలిగించింది. వేగంగా వెళ్తున్న వాహనాలను పట్టించుకోకుండా ఆమె రీల్స్ కోసం డ్యాన్స్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 3.4 లక్షల మంది వీక్షించారు. చాలా మంది ఆ మహిళ తీరుపై ఆగ్రహం వ్యక్తి చేశారు. ```రీల్ మేకింగ్ అనే దెయ్యం ఇప్పుడు ఆంటీలను ఎక్కువగా వెంటాడుతోంది``, ``ప్రభుత్వం త్వరలో డ్యాన్స్ ట్యాక్స్ వసూలు చేస్తుంది``, ``రోడ్ టెస్టింగ్ జరుగుతోంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: పోలీస్ అంకుల్.. మా నాన్నను జైల్లో పెట్టండి.. తన తండ్రిపై పోలీసులకు కంప్లైంట్ చేసిన ఐదేళ్ల బాలుడు!


Viral: ట్రక్ డ్రైవరే కానీ, మహానుభావుడు.. ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఇతడు నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే..

Picture Puzzle: మీ కళ్ల సామర్థ్యాన్ని చెక్ చేసుకోండి.. ఈ ఫొటోలో చెర్రీల మధ్యనున్న టమాటాను 8 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral Video: ఈ దొంగ తెలివితేటలకు షాకవ్వాల్సిందే.. లోపలికి రాకుండా ఏటీఎమ్‌ను ఎలా లూటీ చేశాడో చూడండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Aug 21 , 2024 | 11:30 AM