Share News

Viral Video: అదృష్టం అంటే ఇదే మరి.. అంత పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో ఎలా బయటపడ్డాడో చూడండి..

ABN , Publish Date - Sep 15 , 2024 | 12:35 PM

అదృష్టం ఉంటే ఎంతటి పెద్ద ప్రమాదం నుంచైనా తప్పించుకోవచ్చు. రెప్ప పాటు కాలంలో ప్రాణాలతో బయటపడవచ్చు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే షాక్‌తో నోట మాట రాదు. చాలా పెద్ద ప్రమాదం నుంచి ఓ బైకర్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

Viral Video: అదృష్టం అంటే ఇదే మరి.. అంత పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో ఎలా బయటపడ్డాడో చూడండి..
Bikers miraculously escape from dangerous accident

అదృష్టం (Luck) ఉంటే ఎంతటి పెద్ద ప్రమాదం (Accident) నుంచైనా తప్పించుకోవచ్చు. రెప్ప పాటు కాలంలో ప్రాణాలతో బయటపడవచ్చు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే షాక్‌తో నోట మాట రాదు. చాలా పెద్ద ప్రమాదం నుంచి ఓ బైకర్ (Biker) త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఆ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. @DriveSmart_IN అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).


వైరల్ అవుతున్న వీడియోలో ఓ రోడ్డు మీద వాహనాలన్నీ వేగంగా వెళ్లిపోతున్నాయి. చిన్న రోడ్డు మీద రెండు వైపులా వాహనాలు వెళ్తున్నాయి. అంతలో ఓ బైకర్ వేగంగా వెళ్తూ తన ముందున్న కారును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో అటువైపు నుంచి వేగంగా ఓ కారు ముందుకు వచ్చింది. ఆ బైక్‌ను వేగంగా ఢీకొట్టింది. అయితే ఆ వ్యక్తి బైక్ నుంచి దిగిపోయాడు. బైక్ మాత్రం కారు కింద పడి నుజ్జునుజ్జయిపోయింది. అలా త్రుటిలో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. లేకపోతే ఆ వ్యక్తికి ఏం జరిగేదో ఊహించుకోవడమే కష్టం.


ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 75 వేల మంది వీక్షించారు. వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అద్భుతాలు అప్పుడప్పుడే జరుగుతాయి``, ``ఇలాంటి వాటికి లాజిక్స్ ఉండవు``, ``పూర్తిగా లక్. లేకపోతే ప్రాణాలు కోల్పోయేవాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: కారు బానెట్ ఓపెన్ చేసిన వ్యక్తికి షాక్.. లోపల ఏం ఉందో చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..


Viral Video: విధి వక్రించడమంటే ఇదే... వర్షంలో డ్యాన్స్ చేస్తూ వీడియో.. చివరకు ఏం జరిగిందో చూడండి..


Optical Illusion: మీవి డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో దాక్కున్న రింగ్ ఎక్కడుందో కనుక్కోండి..


Viral Video: హాస్టల్‌లో ఉంటే ఇలాంటివి తప్పవు.. చపాతీతో నూడిల్స్ ఎలా తింటోందో చూడండి.. వీడియో వైరల్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 15 , 2024 | 12:35 PM