Viral Video: సముద్రంతో ఆటలాడితే ఇలాగే ఉంటుంది.. రీల్స్ కోసం వెళితే ఏం జరిగిందో చూడండి..
ABN , Publish Date - Jun 25 , 2024 | 01:00 PM
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు కొందరు చేస్తున్న ప్రయోగాలు చూస్తుంటే బాధపడాలో, జాలి పడాలో తెలియడం లేదు. సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయేందుకు కొందరు ఆకతాయిలు ఎంతకైనా తెగిస్తున్నారు. ప్రమాదాలతో ఆడుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు కొందరు చేస్తున్న ప్రయోగాలు చూస్తుంటే బాధపడాలో, జాలి పడాలో తెలియడం లేదు. సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయేందుకు కొందరు ఆకతాయిలు ఎంతకైనా తెగిస్తున్నారు. ప్రమాదాలతో ఆడుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు (Instagram reels). తాజాగా గుజరాత్ (Gujarat)కు చెందిన కొందరు కుర్రాళ్లు సముద్రంలో రీల్స్ చేయడానికి ప్రయత్నించి తగిన గుణపాఠం నేర్చుకున్నారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
@kumarmanish9 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. గుజరాత్‌లోని కచ్ (Kutch)లోని ముంద్రా టౌన్‌లోని భద్రేశ్వర్‌లో బీచ్‌లో కొందరు కుర్రాళ్లు మహీంద్రా థార్ (Mahindra Thar) వాహనాలతో రీల్స్ చేసేందుకు ప్రయత్నించారు. రెండు థార్ వాహనాలు తీసుకుని నేరుగా సముద్రం (Sea)లోకి వెళ్లిపోయారు. అయితే ఆ సమయంలో సముద్రం పోటు మీద ఉండడం, అలలు విపరీతంగా ఎగిసి పడుతుండడంతో ఆ కార్లు నీటిలో చిక్కుకుపోయాయి. ఆ కార్లును ఒడ్డుకు చేర్చేందుకు ఆ కుర్రాళ్లు చాలా ఇబ్బందులు పడ్డారు. ఒకరు కారును ఎత్తేందుకు కూడా యత్నించారు. కానీ వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు.
చివరికి స్థానికుల సాయంతో ట్రాక్టర్ తీసుకొచ్చి ఎలాగోలా తమ వాహనాలను సముద్రం ఒడ్డకు చేర్చగలిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 15 వేల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ వీడియో స్థానిక పోలీసుల కంట పడడంతో వారు కేసులు నమోదు చేశారు. రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక కుర్రాడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఈ చిన్న ట్రిక్‌తో ఎలా మోసం చేస్తున్నారో చూడండి.. కళ్లకు కట్టినట్టు చూపించిన వ్యాపారి!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..