Viral Video: వార్నీ.. పూరీలను ఇలా ఎవరైనా చేస్తారా? నవ్వు తెప్పిస్తున్న వైరల్ వీడియో..
ABN , Publish Date - Sep 16 , 2024 | 04:49 PM
కాలేజీలో చదువుకుంటూనో, కెరీర్ ఆరంభంలోనూ ఉద్యోగం చేస్తూనో బ్యాచిలర్ జీవితం గడపడం చాలా మందికి అనుభవమే. హాస్టల్లోనో, స్నేహితులతో కలిసి రూమ్‌లోనో ఉంటూ చాలా మంది కుర్రాళ్లు బ్యాచిలర్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. చాలా మంది స్వయంగా రూమ్‌లో ఉండి వంట కూడా చేసుకుంటారు.
కాలేజీలో చదువుకుంటూనో, కెరీర్ ఆరంభంలోనూ ఉద్యోగం చేస్తూనో బ్యాచిలర్ జీవితం (Bachelor life ) గడపడం చాలా మందికి అనుభవమే. హాస్టల్లోనో, స్నేహితులతో కలిసి రూమ్‌లోనో ఉంటూ చాలా మంది కుర్రాళ్లు బ్యాచిలర్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. చాలా మంది స్వయంగా రూమ్‌లో ఉండి వంట (Cooking) కూడా చేసుకుంటారు. ఆ సమయంలో కుర్రాళ్లు పడే పాట్లు, వారు వేస్లే ప్లాన్లు చాలా ఫన్‌గా ఉండి ఇతరులను ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
white_dust22 అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది. వారు వెరైటీగా చేస్తున్న వంట చాలా మందిని ఆకట్టుకుంటోంది. ముగ్గురు కుర్రాళ్లు చాలా వెరైటీగా పూరీలు (Puri) చేస్తున్నారు. ఒక కుర్రాడు పూరీ పిండిని వెరైటీగా కలిపి మరొకరికి ఇస్తున్నారు. ఇంకో కుర్రాడు పూరీని ఒత్తి గోడకు అంటిస్తున్నాడు. ఆ గోడ నుంచి మరో కుర్రాడు పూరీని తీసి పెనంలోకి విసురుతున్నాడు. పూరీని వేయించిన తర్వాత వాటితో కలిసి వీడియోలకు ఫోజులిస్తున్నారు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 12 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు 53 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``ఫుడ్‌కు తగినంత గౌరవం ఇవ్వకపోతే చాలా ఇబ్బందులు పడాలి``, ``ఆ పూరీలు ఎంత పరిశుభ్రంగా ఉంటాయో``, ``బ్యాచిలర్ లైఫ్ ఇలాగే ఉంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వార్నీ.. ఈ బుడతడు భలే ధైర్యవంతుడు.. బల్లిని పట్టుకుని ఎలా ఆడుతున్నాడో చూడండి..
Picture Puzzle: మీ బ్రెయిన్‌కు అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో తప్పు ఎక్కడుందో కనుక్కోండి..
Viral Video: అదృష్టం అంటే ఇదే మరి.. అంత పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో ఎలా బయటపడ్డాడో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..