Share News

Viral Video: వీళ్లు కలిసి ఉండడం కష్టమే.. వివాహ వేదికపై వధూవరుల ప్రవర్తన చూస్తే షాకవ్వాల్సిందే!

ABN , Publish Date - May 11 , 2024 | 04:21 PM

పెళ్లి అంటేనే సందడి. బంధుమిత్రులతో కలిసి చేసుకునే సంబరం. అలాంటి పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లిలో జరిగే ఫన్నీ ఘటనలు, ఆసక్తికర దృశ్యాలను చాలా మంది వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Viral Video: వీళ్లు కలిసి ఉండడం కష్టమే.. వివాహ వేదికపై వధూవరుల ప్రవర్తన చూస్తే షాకవ్వాల్సిందే!
Wedding

పెళ్లి (Wedding) అంటేనే సందడి. బంధుమిత్రులతో కలిసి చేసుకునే సంబరం. అలాంటి పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు (Wedding Videos) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లిలో జరిగే ఫన్నీ ఘటనలు, ఆసక్తికర దృశ్యాలను చాలా మంది వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియోలు చాలా మందికి నచ్చుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవాల్సిందే (Viral Video).


shan_singh అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వివాహ వేదికపై వధూవరులు ఉన్నారు. వధూవరులు ఎదురెదురుగా నిల్చుని దండలు మార్చుకుంటున్నారు. ముందుగా వధువు తన చేతిలోని దండను వరుడి మీదకు విసిరింది. అది అతడు పెట్టుకున్న తలపాగాకు తగులుకుని అలాగే ఉండిపోయింది. అనంతరం వరడు దూరం నుంచే దండను వధువు మెడపై వేశాడు. అది వధువు మెడ నుంచి కిందకు పడిపోయింది. ఈ వీడియో చూసిన వారు నవ్వకుండా ఉండలేకపోతున్నారు.


ఈ ఫన్నీ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. 68 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``పాపం.. ఇద్దరికీ పెళ్లి ఇష్టం లేనట్టుంది``, ``నేను బెట్ వేస్తా.. వారికి ప్రేమ్ అనే కొడుకు పుడతాడు``, ``వారికి వైబ్ మ్యాచ్ అవుతుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: అతిథులకు భోజనం పెట్టే విషయంలో భారతీయులకు ఎవరూ సాటి రారట.. వీడియో వైరల్!


Viral Video: నడిరోడ్డు మీద కార్‌తో ఛేజింగ్.. పంజాబ్‌లో ఓ మహిళకు భయంకర అనుభవం.. వీడియో వైరల్!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 11 , 2024 | 04:21 PM