Share News

Viral Video: ఈ వరుడు ధోనీ కంటే స్పీడ్‌గా ఉన్నాడు.. మరదలికి మెరుపు వేగంతో షాకిచ్చాడు.. వీడియో వైరల్

ABN , Publish Date - Aug 30 , 2024 | 02:53 PM

పెళ్లిళ్లలో జరిగే ఫన్నీ సంఘటనలు, ఆసక్తికర ఘటనలకు సంబంధించిన ఎన్నో వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లిళ్లలోని బంధువుల మధ్య జరిగే సరదా సంఘటనలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది.

Viral Video: ఈ వరుడు ధోనీ కంటే స్పీడ్‌గా ఉన్నాడు.. మరదలికి మెరుపు వేగంతో షాకిచ్చాడు.. వీడియో వైరల్
Sister-in-law played a trick to make the groom eat sweets

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల (Wedding) సీజన్ నడుస్తోంది. పెళ్లిళ్లలో జరిగే ఫన్నీ సంఘటనలు, ఆసక్తికర ఘటనలకు సంబంధించిన ఎన్నో వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లిళ్లలోని బంధువుల మధ్య జరిగే సరదా సంఘటనలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో (Funny Wedding Video) వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో వరుడి (Groom)ని ఏడిపించడానికి మరదలు ప్రయత్నించింది. అయితే వరుడే ఆమెకు గట్టి షాకిచ్చాడు. ఆ వీడియో చూసిన వారు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు (Viral Video).


@HasnaZaruriHai అనే ట్విటర్ హ్యాండిల్‌లో వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో వరుడు ఓ డిన్నర్ టేబుల్ ముందు కూర్చున్నాడు. అతడి ముందు రకరకాల స్వీట్లు ఉన్నాయి. అక్కడకు వధువు సోదరి వచ్చి వరుడికి స్వీట్ (Sweet) తినిపించే గేమ్ మొదలుపెట్టింది. వరుడి నోటు ముందు స్వీట్ పెట్టి, అతడు నోరు తెరిచే లోపు తీసెయ్యాలని ప్లాన్ చేసింది. అలా వరుడిని ఏడిపించాలనుకుంది. అయితే వరుడు ఇంకా స్మార్ట్‌గా ప్రవర్తించాడు. నోటి ముందు స్వీట్ ఉన్నా చాలా సేపు నోరు తెరవలేదు. కొంతసేపటికి మెరుపు వేగంతో ఆ స్వీట్‌ను తినేశాడు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఈ వైరల్ ఫన్నీ వీడియోను ఇప్పటివరకు 10 లక్షల మందికి పైగా వీక్షించారు. 7.7 వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ``బ్రదర్.. ధోనీ స్టంపింగ్ కంటే చాలా ఫాస్ట్‌గా ఉన్నాడు``, ``పురుగులను పట్టుకునేందుకు బల్లి ఉపయోగించే టెక్నిక్``, ``ఆ అమ్మాయి భయపడి ఉంటుంది``, ``మెరపు వేగం అంటే ఇదే`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion: డైనోసర్ల మధ్య ఉన్న బల్బును కనిపెట్టండి.. మీ పరిశీలనా శక్తి ఏపాటిదో తెలుసుకోండి..


Viral Video: కేవలం రూ.50కే పలు వెరైటీలతో లంచ్.. ఆనంద్ మహీంద్రా రియాక్షన్ ఏంటంటే..


Viral Video: ఇదేం పని నాగరాజా.. బెడ్రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు చుట్టుకున్న నాగుపాము.. ఫ్యాన్ వేస్తే..


Optical Illusion: మీ కళ్లకు, బ్రెయిన్‌కు రియల్ టెస్ట్.. ఈ ఫొటోలో దాక్కున్న మరో నలుగురిని కనిపెట్టండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 30 , 2024 | 02:53 PM