Share News

Viral Video: అద్భుతాన్ని ఆవిష్కరించిన చైనా డ్రోన్.. మౌంట్‌ ఎవరెస్ట్‌పై పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి..

ABN , Publish Date - Jul 13 , 2024 | 10:51 AM

మౌంట్ ఎవరెస్ట్.. ఎంతో మంది సాహసీకులను ఆకర్షించే అందమైన ప్రాంతం. ప్రపంచంలో అతి ఎత్తైన పర్వత శిఖరం. అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలని అందరికీ ఉంటుంది. కానీ, అక్కడకు చేరుకోవడం చాలా కొద్ది మందికే సాధ్యమవుతుంది.

Viral Video: అద్భుతాన్ని ఆవిష్కరించిన చైనా డ్రోన్.. మౌంట్‌ ఎవరెస్ట్‌పై పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి..
Mount Everest

మౌంట్ ఎవరెస్ట్ (Mount Everest).. ఎంతో మంది సాహసీకులను ఆకర్షించే అందమైన ప్రాంతం. ప్రపంచంలో అతి ఎత్తైన పర్వత శిఖరం. అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలని అందరికీ ఉంటుంది. కానీ, అక్కడకు చేరుకోవడం చాలా కొద్ది మందికే సాధ్యమవుతుంది. అలాంటి వారి కోసం చైనా (China)కు చెందిన ఓ డ్రోన్ కంపెనీ అద్బుత దృశ్యాలను ఆవిష్కరించింది. ఎవరెస్ట్ మీది అందాలను కళ్లకు కట్టినట్టు చూపించింది. ఆ అద్భుత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


చైనాకి చెందిన డ్రోన్‌ కంపెనీ డీజేఐ గ్లోబల్‌ (DJI Global) తన ప్రీమియం ``డీజేఐ మావిక్ 3 ప్రో`` డ్రోన్ సహాయంతో ఎవరెస్ట్ అందాలను చిత్రీకరించింది. సముద్రమట్టానికి 5,300 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్‌ క్యాంప్‌ నుంచి డ్రోన్‌ను ప్రయోగించారు. బేస్ క్యాంప్ నుంచి మరో 3,500 మీటర్లు పైకి ఎగిరిన డ్రోన్ శిఖరం పై దృశ్యాలను అద్బుతంగా చిత్రీకరించింది. ఎవరెస్ట్ ఎక్కుతున్న, దిగుతున్న జనాలను క్యాప్చర్ చేసింది. తెల్లటి రాళ్లు, పాల కడలి లాంటి దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి.


ఖుంబూ ఐస్‌ఫాల్, చుట్టుపక్కల హిమానీనదాలు ఆకట్టుకుంటున్నాయి. పూర్తిగా మంచుతో నిండి ఉన్న ఎవరెస్ట్ అద్భుతంగా కనిపిస్తోంది. ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 3.7 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియో అద్భుతం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Picture Puzzle: ఈ ఫొటోలో ఒక్క చంద్రుడు కాస్త భిన్నంగా ఉన్నాడు.. 15 సెకెన్లలో కనిపెట్టండి!


Viral Video: ఈ టెక్నిక్ తెలియక పూరీలు చేయడానికి ఎంత టైమ్ వేస్ట్ చేశాం.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 13 , 2024 | 10:51 AM