Share News

Cooler: కూలర్ ఎప్పటికీ పాడవకూడదంటే.. ఇలా క్లీన్ చేయండి..!

ABN , Publish Date - Jul 05 , 2024 | 01:08 PM

మధ్యతరగతి, దిగువ తరగతి వారు మాత్రం కూలర్ల మీద ఆధారపడతారు. నిజానికి ఏసీ కంటే కూడా కూలర్ ఏ బెస్ట్ అని ఈ రెండింటినీ కంపేర్ చేసేవారు చెబుతుంటారు. కూలర్ కు విద్యుత్ వినియోగం తక్కువ, ఒక చోట నుండి మరొక చోటికి సులువుగా తరలించవచ్చు. కూలర్ గాలి నుండి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ.

Cooler:  కూలర్ ఎప్పటికీ పాడవకూడదంటే.. ఇలా క్లీన్ చేయండి..!

వేసవికాలంలో డబ్బున్న వాళ్లంతా ఏసీల మీద ఆధారపడితే మధ్యతరగతి, దిగువ తరగతి వారు మాత్రం కూలర్ల మీద ఆధారపడతారు. నిజానికి ఏసీ కంటే కూడా కూలర్ ఏ బెస్ట్ అని ఈ రెండింటినీ కంపేర్ చేసేవారు చెబుతుంటారు. కూలర్ కు విద్యుత్ వినియోగం తక్కువ, ఒక చోట నుండి మరొక చోటికి సులువుగా తరలించవచ్చు. కూలర్ గాలి నుండి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ. అయితే కూలర్లు తరచుగా పాడవుతున్నాయని కొందరు కంప్లైంట్ చేస్తుంటారు. కూలర్ ఎప్పటికీ పాడవకూడదంటే దాన్ని క్లీన్ చేసే పద్దతి చాలా ముఖ్యం. కూలర్ ను ఎలా క్లీన్ చేయాలో తెలుసుకుంటే..

Raisins: ఎండుద్రాక్ష ఆరోగ్యానికి మంచిదే.. కానీ దీన్ని ఎవరు తీసుకోకూడదంటే..!



కూలర్ సూపర్ గా పనిచేయాలన్నా, కూలర్ గాలి చాలా తాజాగా ఉండాలన్నా కూలర్ లో నీటిని మార్చాలి. ప్రతివారం కూలర్ లో ఉండే పాత నీటిని తీసేసి కొత్తనీరు పెట్టాలి.

కూలర్ లో పాత నీటిని తీసివేసిన వెంటనే కొత్త నీరు పెట్టకూడదు. కూలర్ లో నీటిని తీసివేసిన తరువాత కొద్జిసేపు కూలర్ ను ఆరనివ్వాలి. కూలర్ లో తడి మొత్తం ఆరిపోయాక గాలి వాసన పోయిందని అనిపించిన తరువాత మాత్రమే నీరు పెట్టాలి.

సాధారణంగా వేసవికాలంలోనే కూలర్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ప్రతి సంవత్సరం వేసవికాలంలో కూలర్ మెష్ ని మార్చాలి. అంటే కూలర్ లో ఉండే గడ్డి. ఈ గడ్డిని మార్చడం వల్ల కూలర్ గాలి చాలా తాజాగా అనిపిస్తుంది. కూలర్ లో చెడు వాసన ఉండదు. కూలర్ పనితీరు కూడా బాగుంటుంది.

Ear Itching: చెవుల్లో దురదగా ఉంటుందా? ఈ టిప్స్ తో వెంటనే తగ్గిపోతుంది..!



చాలామంది వేసవికాలంలో కూలర్ ను బాగా వాడిన తరువాత తిరిగి కూలర్ ను మాములుగానే మూలన పెట్టేస్తుంటారు. కానీ ఇలా చేయకూడదు. కూలర్ వాడకం ఆపగానే కూలర్ లో నీటిని తొలగించి, తేమ మొత్తం ఆరిపోయిన తరువాత పెద్ద కవర్ లేదా ఏదైనా పెద్ద క్లాత్ సహాయంతో కూలర్ ను కప్పాలి. దీనివల్ల కూలర్ లో కానీ, కూలర్ చుట్టూ కానీ దోమలు, ఈగలు వంటివి రావు.

పై జాగ్రత్తలు తీసుకుంటే కూలర్ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. పైపెచ్చు కూలర్ పనితీరు కూడా బాగుంటుంది.

Papaya: జాగ్రత్త.. బొప్పాయిని ఈ ఆహారాలతో కలిపి అసలు తినకూడదు..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 05 , 2024 | 01:08 PM