Share News

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. హోరు గాలిలో ఘాట్ రోడ్‌లో జర్నీ ఎంత ప్రమాదకరమో తెలుసా? ఈ వీడియో చూస్తే..

ABN , Publish Date - May 20 , 2024 | 10:57 AM

వేసవి కాలంలో చాలా మంది చల్లదనం కోసం కొండ ప్రాంతాలకు, వ్యాలీలకు వెళుతుంటారు. అందమైన పర్వతాలు, లోతైన లోయలు ఈ సీజన్‌లో చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తాయి. కొండల పైకి వెళ్లడానికి వేసే ఘాట్ రోడ్ల మీద ప్రయాణం అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది.

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. హోరు గాలిలో ఘాట్ రోడ్‌లో జర్నీ ఎంత ప్రమాదకరమో తెలుసా? ఈ వీడియో చూస్తే..
Bus accident Char Dham Yatra

వేసవి కాలంలో చాలా మంది చల్లదనం కోసం కొండ ప్రాంతాలకు, వ్యాలీలకు వెళుతుంటారు. అందమైన పర్వతాలు, లోతైన లోయలు ఈ సీజన్‌లో చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తాయి. కొండల పైకి వెళ్లడానికి వేసే ఘాట్ రోడ్ల మీద ప్రయాణం అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఆ ఘాట్ రోడ్ల మీద వాహనాలను నడిపే డ్రైవర్లకు ఎంతో నైపుణ్యం ఉండాలి. లేకపోతే ఇరుకు, మలుపులు ఎక్కువగా ఉండే రోడ్లపై ప్రమాదాలు తప్పవు (Viral Video).


ఇరుకు ఘాట్ రోడ్లపై (Ghat Roads), వర్షం పడుతున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా వాహనాలను నడపాలి. లేకపోతే భారీ ప్రమాదాలు జరుగుతాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే షాకవ్వాల్సిందే. హోరు గాలి, వానలో బస్సు నడుపుతున్న ఓ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ భారీ ప్రమాదానికి కారణమైంది (Bus Accident). అయితే అదృష్టవశాత్తూ ప్రాణనష్టం సంభవించలేదు. ఘాట్ రోడ్డులో వ్యాన్‌పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఆ వీడియో తీశాడు. ఆ వ్యాన్ ముందు వెళ్తున్న బస్సు వేగంగా వెళ్తోంది. అయితే మలుపులో అకస్మాత్తుగా మరో బస్సు ఎదురు రావడంతో రెండూ ఢీకొట్టుకున్నాయి. ఛార్‌ధామ్ (Char Dham Yatra) యాత్ర సందర్భంగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.


ఆ యాక్సిడెంట్ దెబ్బకు బస్సు అద్దాలు పగిలిపోయాయి. ముందు కూర్చున్న ప్రయాణికులు రోడ్డుపై పడిపోయి గాయాలపాలయ్యారు. అయితే రోడ్డు అంచున నిర్మించిన ఇనుప కంచె వల్ల బస్సు లోయలోకి జారిపోకుండా నిలబడగలిగింది. లేకపోతే భారీ ప్రాణనష్టం సంభవించేది. manojrawatmilan007 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 8 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు.

ఇవి కూడా చదవండి..

Opitcal Illusion: మీ కళ్లకు అసలైన పరీక్ష.. ఈ ఫొటోలోని వ్యక్తి టోపీ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి!


Viral Video: ఈ ఏనుగులకు ఇంత క్రమశిక్షణ ఎవరు నేర్పారు? ఎంత పద్ధతిగా వ్యాన్ ఎక్కుతున్నాయో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 20 , 2024 | 10:57 AM