Longest rain shower: వామ్మో.. భూమ్మిద 20 లక్షల ఏళ్ల పాటు ఏకధాటిగా కురిసిన వర్షం!
ABN , Publish Date - Mar 09 , 2024 | 07:52 PM
సుమారు 25 కోట్ల సంవత్సరాల క్రితం భూమ్మీద ఏకంగా 20 లక్షల ఏళ్ల పాటు వర్షం కురిసిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పది నిమిషాలకు మించి వర్షం కురిసిందంటేనే మనం గగ్గోలు పెడతాం. పనులన్నీ ఆగిపోయాయంటూ విసుక్కుంటాం. అలాంటిది భూమ్మీద ఒకానొక సమయంలో సుమారు 20 లక్షల ఏళ్ల పాటు వర్షం ఏకధాటిగా కురిసిదంటే ఆశ్చర్యం కలగకమానదు (Longest Rain Shower). కానీ ఇది నిజమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుమారు 30 నుంచి 20 కోట్ల సంవత్సరాల క్రితం ఈ అసాధారణ ఘటన జరిగిందని తేల్చారు. దీన్ని కార్నియన్ ప్లూవియల్ ఘటనగా (Carnian Pluvial Event) పేర్కొంటారు.
Viral: చనిపోయే ముందు మనవరాళ్లకు భారీ షాకిచ్చాడుగా! తాతలను హర్ట్ చేస్తే ఎవరికైనా ఇదే గతి!
అప్పట్లో భూమ్మీద ఇప్పుడున్నన్ని ఖండాలు ఉండేవి కావు. పాంజియా (Pangea) అనే ఒకే ఒక మహా ఖండం ఉండేది. డైనోసార్లు ఉనికిలోకి వస్తున్న సమయం అది. శాస్త్రవేత్తలు చెప్పే దాని ప్రకారం, ఈ అసాధారణ వర్షపాతానికి ముందు సుదీర్ఘకాలం పాటు భూమ్మీద చుక్క వర్షపు నీరు కూడా పడలేదు. చాలా రకాల జీవజాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. డైనోసార్లకు (Dinosaurs) కష్టాలు మొదలయ్యాయి. అలాంటి సమయంలో వ్రాంగెలియా లార్జి ఇంగ్నియస్ ప్రావిన్స్‌లో ఓ భారీ అగ్నిపర్వతం బద్దలైందట. దీంతో, వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతో సముద్రంలోని నీరు ఆవిరై వాతావరణంలో తేమ శాతం అనూహ్యంగా పెరిగింది. తేమ శాతం పతాకస్థాయికి చేరుకున్నాక ఒక్కసారిగా వర్షం కురవడం ప్రారంభమై.. లక్షల ఏళ్ల పాటు కొనసాగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ అసాధారణ సుదీర్ఘ వర్షపాతం కారణంగా భూమ్మీద అనేక వృక్ష, జీవజాతులు పట్టుకొచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డైనోసార్లు కూడా ఈ వర్షం కారణంగా బాగా లాభపడ్డాయట. ప్రస్తుతం మనం చూస్తున్న జీవివైవిధ్యం వెనక ఆ వర్షమే కారణమని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. పురాతన రాతిశిలలు, వాటిపై కొన్నేళ్లుగా పేరుకుంటూ వచ్చిన సెడిమెంట్స్‌ను పరిశీలించిన శాస్త్రజ్ఞులు ఈ సుదీర్ఘవర్షం పాతం గురించి తెలుసుకున్నారు.
Viral: భార్య తనకు సొంత చెల్లెలు అవుతుందని పెళ్లైన 6 ఏళ్లకు తెలిసి..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి