Share News

Pawan Kalyan: పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజ్‌నెవా గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? ఆమె ఆస్తులు విలువ ఎంతంటే..

ABN , Publish Date - Jun 14 , 2024 | 03:38 PM

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అద్భుత విజయం సాధించడానికి కారణమైన కీలక వ్యక్తి పవన్ కల్యాణ్. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన పవన్ కల్యాణ్ పార్టీ జనసేన పోటీ చేసిన అన్ని చోట్లా విజయ ఢంకా మోగించింది. మొత్తం 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లలో గెలుపొందింది.

Pawan Kalyan: పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజ్‌నెవా గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? ఆమె ఆస్తులు విలువ ఎంతంటే..
Pawan Kalyan, Anna Lezhneva

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అద్భుత విజయం సాధించడానికి కారణమైన కీలక వ్యక్తి పవన్ కల్యాణ్ (Pawan Kalyan). విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన పవన్ కల్యాణ్ పార్టీ జనసేన పోటీ చేసిన అన్ని చోట్లా విజయ ఢంకా మోగించింది. మొత్తం 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లలో గెలుపొందింది. పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రిగా, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించబోతున్నారు. కాగా, పవన్ కల్యాణ్ గెలిచిన తర్వాత అతని భార్య అన్నా లెజ్‌నెవా (Anna Lezhneva) లైమ్‌లైట్‌లోకి వచ్చారు.


ఈ నేపథ్యంలో అన్నా లెజ్‌నెవా గురించి ఆసక్తి మొదలైంది. రష్యాకు చెందిన మోడల్ అయినా అన్నా లెజ్‌నెవా 1980లో రష్యాలో జన్మించారు. మోడల్ అయిన తర్వాత పలు భారతీయ సినిమాలోనూ, దక్షిణాది చిత్రాల్లోనూ మెరిశారు. పవన్ కల్యాణ్ తీన్‌మార్‌లో నటిస్తున్న సమయంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నారు. 2013లో వివాహం చేసుకున్నారు. 2017లో అన్నా లెజ్‌నెవా, పవన్‌లకు మార్క్ శంకర్ పవనోవిచ్ జన్మించాడు.


పవన్, అన్నా దంపతులకు ఓ కూతురు కూడా ఉంది. ఆ బాలిక పేరు పొలేనా అంజనా పవనోవా. మోడలింగ్ కెరీర్ మాత్రమే కాకుండా అన్నా బిజినెస్ ఉమెన్ కూడా. ఆమెకు సింగపూర్‌లో హోటల్ చైన్ బిజినెస్ ఉన్నట్టు ఓ ఆంగ్ల వెబ్‌సైట్ పేర్కొంది. ఆమెకు రష్యాలోనూ, సింగపూర్‌లోనూ ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ.1800 కోట్లు అని సమాచారం.

ఇవి కూడా చదవండి..

Viral Video: రీల్ చేద్దామనుకుని ఏనుగుకు దొరికిపోయాడు.. ఒక్క దెబ్బకు ప్రాణాలు కోల్పోయాడు.. వీడియో వైరల్!


Success story: ఇద్దరూ సివిల్స్ రాస్తే ఒక్కరే సెలెక్ట్ అయి ఐపీఎస్ అయ్యారు.. ఫెయిల్ అయిన ఆ రెండో వ్యక్తి ఏమయ్యారంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 14 , 2024 | 03:38 PM