Share News

Viral: విమానంలో ఇదేందయ్యా? సీటు కోసం ఎలా కొట్టుకున్నారో చూడండి!

ABN , Publish Date - May 09 , 2024 | 06:17 PM

విమానంలో సీటు కోసం ఇద్దరు ప్రయాణికులు పరస్పరం చేయిచేసుకున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తైవాన్ నుంచి అమెరికా వెళుతున్న ఈవీఏ ఎయిర్‌విమానంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

Viral: విమానంలో ఇదేందయ్యా? సీటు కోసం ఎలా కొట్టుకున్నారో చూడండి!

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా బస్సు, రైళ్లల్లో సీటు కోసం జనాలు గొడవలు పడుతుంటారు. ఒకరి సీటులో మరొకరు కూర్చోవడం వంటి కారణాలతో ఓ రేంజ్‌లో తగదాకు దిగుతారు. దాదాపు ఇలాంటి ఘటనే ఓ విమానంలో చోటుచేసుకోవడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ (Viral) అవుతోంది.

మంగళవారం తైపీ నగరం (తైవాన్) నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు (అమెరికా) బయలుదేరిన ఈవీఏ ఎయిర్ ఫ్లైట్ బీఆర్08 విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడి పక్కనున్న వ్యక్తి అకస్మాత్తుగా దగ్గడం ప్రారంభించాడు. దీంతో, ఆ ప్రయాణికుడు మరో సీటులోకి వెళ్లి కూర్చుకున్నాడు. ఈలోపు బాత్రూం నుంచి తిరిగొచ్చిన ప్రయాణికుడు తన సీటులో అతడిని చూసి కోపోద్రిక్తుడయ్యాడు. ఇద్దరి మధ్య గొడవ మొదలైంది (Fist fight between 2 passengers on California bound flight over seat).

Viral: వామ్మో.. అమెరికాలో ఇలాంటి దృశ్యమా.. ఆశ్చర్యపోతున్న భారతీయులు


ఈ క్రమంలో ఆ ప్రయాణికుడు తన సీటులో కూర్చున్న వ్యక్తితో భీకరంగా గొడవకు దిగాడు. అతడిపై ముష్టిఘాతాలు కురిపించాడు. ఇద్దరినీ విడదీసేందుకు విమానం క్రూ నానా ఇబ్బందీ పడాల్సి వచ్చింది. ముష్టిఘాతాలతో విరుచుకుపడుతున్న వ్యక్తిని నియంత్రించేందుకు విమాన సిబ్బందిలో ఒకరు వెనక నుంచి పట్టుకుని నిలువరించాల్సి వచ్చింది. చివరకు సిబ్బంది వారిద్దరినీ వేరు వేరు సీట్లల్లో కూర్చోబెట్టినా ఒకరితో మరొకరు గొడవపడటం ఆపలేదు. దీంతో, వారిని చివరకు వేర్వేరు క్యాబిన్‌లలో కూర్చోబెట్టాల్సి వచ్చింది. గొడవపడుతున్న ప్రయాణికులను నిలువరించేందుకు తోటి ప్రయాణికులు కూడా సిబ్బందికి తోడుగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవడం ప్రారంభించింది.

విమానం అమెరికాలో ల్యాండయ్యాక పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ ఘటనపై ఈవీఏ ఎయిర్‌ ఇంకా స్పందించలేదు.

ఇక జనాలు ఈ వీడియోపై వివిధ రకాలుగా కామెంట్ చేశారు. సుదీర్ఘదూరాలు ప్రయాణించే విమానాల్లో ఇలాంటి వివాదాలు ప్రమాదకరమని కందరు వ్యాఖ్యానించారు. వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది.

Read Viral and Telugu News

Updated Date - May 09 , 2024 | 06:26 PM