Leopard Attack: చిరుత దాడి నుంచి తృటిలో తప్పించుకున్న జింబాబ్వే మాజీ క్రికెటర్
ABN , Publish Date - Apr 25 , 2024 | 06:32 PM
జింబాబ్వే మాజీ క్రికెటర్ గై విఠాల్ తాజాగా చిరుత దాడి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. గాయాలపాలైన ఆయనను హరారేకు తరలించి అత్యవసర శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం విఠాల్ కోలుకుంటున్నట్టు ఆయన భార్య తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: జింబాబ్వే (Zimbabwe) మాజీ క్రికెటర్ గై విఠాల్ (Guy Whittal) తాజాగా చిరుత దాడి (Leopard Attack) నుంచి తృటిలో తప్పించుకున్నాడు. గాయాలపాలైన ఆయనను హరారేకు తరలించి అత్యవసర శస్త్రచికిత్స చేశారు. విఠాల్‌కు చెందిన బఫెలో రేంజ్‌లో ఈ దాడి జరిగింది. ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నట్టు విఠాల్ భార్య హానా పేర్కొన్నారు. చిరుత దాడిలో విఠాల్‌కు తీవ్ర గాయాలైనట్టు తెలిపారు. తన భర్తకు తక్షణ సాయం అందించిన వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
Odisha: నిరుద్యోగులను నిండా ముంచేశాడుగా! ఏకంగా రూ.2 కోట్లు దోచేసిన వైనం
విఠాల్.. జింబాబ్వేలో సఫారీ వ్యాపారం నిర్వహిస్తుంటారు. ఇటీవల హుమానీలోని తన వనంలో ఆయన ట్రెక్కింగ్ చేస్తుండగా చిరుత దాడి చేసింది. తీవ్ర రక్తస్రావమైన ఆయనకు హిప్పో క్లీనిక్‌లో అత్యవసర వైద్య చికిత్స అందించారు. అనంతరం హెలికాఫ్టర్‌లో హరారేలోని ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం మిల్టన్ మార్క్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయాలను విఠాల్ భార్య హానా సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన భర్త త్వరగా కోలుకోవాలంటూ మేసేజీలు పెట్టిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు (Former Zimbabwe Cricketer Narrowly Escapes Death After Being Attacked By A Leopard).
Viral Video: వామ్మో..! ఈ కింగ్ కోబ్రా ఎంత పని చేసిందీ.. దాని నోటి నుంచి ఏం బయటికి వచ్చిందో చూస్తే..
కాగా, 2013లో విఠాల్ మంచం కింద ఓ భారీ మొసలి దూరి హడలెత్తించింది. ఓ రాత్రి ఆయన గదిలోకి వచ్చిన మొసలి మంచం కింద దూరి అక్కడే సైలెంట్‌గా పడుకుండిపోయింది. మరుసటి రోజున, విఠాల్ సహాయకురాలు ఆయన గదిలోకి వచ్చి చూడగా మొసలి కనిపించడంతో ఆమె ఆయనను అలర్ట్ చేసింది. ఇక దాదాపు పదేళ్ల పాటు జింబాబ్వే తరపున ఆడిన విఠాల్ తన కెరీర్‌లో మొత్తం 46 టెస్టులు, 147 వన్డేల్లో పాల్గొన్నాడు.