Viral Video: మనవడి కోసం వినూత్న ట్రెడ్మిల్ తయారు చేసిన తాత.. ఆ కుర్రాడి బాధలు చూస్తే నవ్వు రాక తప్పదు..
ABN , Publish Date - Sep 23 , 2024 | 10:57 AM
బరువు తగ్గాలనుకునే చాలా మంది జిమ్‌కు వెళ్లి కఠినమైన వర్కవుట్లు చేయాలనుకుంటారు. కరెంట్‌తో పని చేసే ట్రెడ్‌మిల్‌పై నడిస్తే మంచిదనుకుంటారు. కొందరు ధనవంతులు ట్రెడ్మిల్లను కొనుక్కుని ఇంట్లోనే పరుగులు పెడుతుంటారు. అంత ఖర్చు పెట్టుకోలేని ఓ వ్యక్తి తన మనవడి కోసం ఇంటి దగ్గరే ఓ వినూత్న ట్రెడ్మిల్ రెడీ చేశాడు.
బరువు తగ్గాలనుకునే (Weight loss) చాలా మంది జిమ్‌కు (Gym) వెళ్లి కఠినమైన వర్కవుట్లు చేయాలనుకుంటారు. కరెంట్‌తో పని చేసే ట్రెడ్‌మిల్‌పై (Treadmill) నడిస్తే మంచిదనుకుంటారు. కొందరు ధనవంతులు ట్రెడ్మిల్లను కొనుక్కుని ఇంట్లోనే పరుగులు పెడుతుంటారు. అంత ఖర్చు పెట్టుకోలేని ఓ వ్యక్తి తన మనవడి కోసం ఇంటి దగ్గరే ఓ వినూత్న ట్రెడ్మిల్ రెడీ చేశాడు. ఆ ట్రెడ్మిల్కు కరెంట్ అక్కర్లేదు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు (Viral Video).
amazingtaishun అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ బహిరంగ ప్రదేశంలో ఓ వ్యక్తి నేచురల్ ట్రెడ్‌మిల్‌ను ఏర్పాటు చేశాడు. వాలుగా ఉన్న ప్రాంతాన్ని చదును చేసి అక్కడ వెదురు కర్రలతో ఓ నిర్మాణం ఏర్పాటు చేశారు. చదును చేసిన ప్రాంతంలో నీరు పోస్తుంటే ఓ కుర్రాడు పరుగులు పెడుతున్నాడు. కర్రలు పట్టుకుని అచ్చం ట్రెడ్మిల్ మీద పరిగెత్తినట్టే పరుగులు పెట్టాడు. చివరకు నీరు బాగా ఎక్కువైపోవడంతో కింద కూడా పడిపోయాడు. లావుగా మారిన తన మనవడి కోసం ఓ తాతయ్య కనిపెట్టిన ట్రెడ్మిల్ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియో వివిధ సామాజిక మాధ్యమాల్లో షేర్ అయింది. ఈ వీడియో ఇప్పటివరకు లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్స్ దక్కించుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ తాత తెలివిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ``ఆ తాత బ్రెయిన్ చాలా షార్ప్``, ``ఓపెన్ ఫామ్ ఉన్నప్పుడు ట్రేడ్ మిల్లు అవసరం ఏమిటి``, ``ఇది ప్రకృతి యొక్క ట్రెడ్మిల్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..