Share News

Hair Oil: జుట్టుకు ఫర్పెక్ట్ ఆయిల్ ఎంచుకోవడం ఎలా? ఇలా తెలుకోండి..!

ABN , Publish Date - Aug 09 , 2024 | 08:59 AM

ఆహారం, జీవనశైలి, వాతావరణ కాలుష్యం మాత్రమే కాకుండా జుట్టు సంరక్షణలో భాగంగా ఉపయోగించే నూనెల ఎంపిక కూడా జుట్టును దెబ్బతీస్తుంది.

Hair Oil: జుట్టుకు ఫర్పెక్ట్ ఆయిల్ ఎంచుకోవడం ఎలా? ఇలా తెలుకోండి..!
Hair oil

ఈకాలం యువత జుట్టుకు సంబంధించిన సమస్యలు చాలా ఎదుర్కొంటున్నారు. ఆహారం, జీవనశైలి, వాతావరణ కాలుష్యం మాత్రమే కాకుండా జుట్టు సంరక్షణలో భాగంగా ఉపయోగించే నూనెల ఎంపిక కూడా జుట్టును దెబ్బతీస్తుంది. జుట్టు రకాన్ని బట్టి నూనెను ఎంచుకుని వాడితే జుట్టు పెరుగుదల ఆరోగ్యంగా ఉంటుందని కేశసంరక్షణ నిపుణులు అంటున్నారు. ఏ రకమైన జుట్టుకు ఎలాంటి నూనె వాడాలో తెలుసుకుంటే..

నూనె రాయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. తలచర్మంలో రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి. చిన్న వయసులోనే జుట్టు బూడిదరంగు లోకి మారడం జరగదు.

ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే ఎంత డబ్బు ఆదా చేయవచ్చో తెలుసా?


స్ట్రెయిట్ హెయిర్..

స్ట్రైయిట్ హెయిర్ ఫ్లాట్ గా ఉంటుంది. ఈ రకమైన జుట్టు ఉన్నవారికి జిడ్డు పట్టే అవకాశం ఎక్కువ. ఇలాంటి జుట్టు ఉన్నవారు ఆర్గాన్ ఆయిల్, జొజోబా ఆయిల్, బాదం నూనె మొదలైనవి జుట్టుకు వాడవచ్చు. ఇవి తేలికగా ఉంటాయి. జుట్టును మరింత జిడ్డుగా కనిపించకుండా చేస్తాయి. జుట్టుకు మంచి పోషణ ఇవ్వడంతో పాటూ జుట్టుకు షైనింగ్ ఇస్తాయి.

ఉంగరాల జుట్టు..

ఉంగరాల జుట్టు వంపులు కలిగి ఉంటుంది. జుట్టు బాగా దట్టంగా ఉన్నవారిలో ఇది కనిపిస్తూ ఉంటుంది. తొందరగా చిక్కులు పడటానికి అవకాశం ఉంటుంది. ఈ జుట్టు రకం ఉన్నవారికి బాదం నూనె, ఆర్గాన్ ఆయిల్, అపకాడో ఆయిల్ వంటి నూనెలు మంచివి. ఈ నూనెలు బరువుగా ఉండవు. ఇవి జుట్టును బలోపేతం చేస్తాయి. జుట్టు చిక్కులు పడకుండా ఉండేందుకు సహాయపడతాయి.

ఈ సమస్యలున్నవారు అవిసె గింజలు పొరపాటున కూడా తినకూడదు..!


గిరిజాల జుట్టు..

గిరిజాల జుట్టు కూడా వంపులు తిరిగి ఉంటుంది. జుట్టు రింగులు రింగులుగా ఎస్ ఆకారాన్ని పోలి ఉంటాయి. చాలావరకు జుట్టు పలుచగా ఉంటుంది. ఈ జుట్టు తొందరగా పొడిబారడం, చిట్లిపోవడం జరుగుతుంది. ఇలాంటి జుట్టుకు కొబ్బరినూనె, ఆలివ్ నూనె, ఆముదం ఉపయోగించడం మంచిది. ఈ నూనెలు వంపులను నిరోధించి జుట్టును అణిచి ఉంచుతాయి. అలాగే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

మందం జుట్టు..

చాలా మందంగా ఉన్న జుట్టు ముతకగా కనిపిస్తుంది. సడన్ గా చూస్తే విగ్ పెట్టారేమో అన్నట్టు అనిపిస్తుంది. దీన్ని మెయింటైన్ చేయడం కాస్త శ్రమతో కూడుకున్నది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా తొందరగా పొడిబాడి చిట్లిపోతుంటుంది. కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, ఆముదం ఈ జుట్టుకు బాగా పనిచేస్తాయి.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో జామ ఆకులు నమిలి తింటే.. వీరికి భలే లాభాలు..!


ఫైన్ హెయిర్..

ఫైన్ హెయిర్ ఉన్నవారి జుట్టు సన్నగా, పలుచగా, సున్నితంగా ఉంటుంది. తక్కువ క్యూలికల్ పొరలు కలిగి ఉంటుంది. జుట్టు మందం లేకపోవడం వల్ల తేలిగ్గా ఉంటుంది. తొందరగా విరిగిపోవడం, బలహీనంగా మారడం, జుట్టు పొడిబారడం జరుగుతుంది. గ్రేప్ సీడ్ ఆయిల్, జోజోబా ఆయిల్, రోజ్ షిప్ ఆయిల్ మొదలైన నూనెలను ఈ జుట్టు ఉన్న వారు ఉపయోగించవచ్చు. ఈ నూనెలు జిగటగా ఉండవు. పైగా ఈ నూనెలను జుట్టు కుదుళ్లు తొందరగా శోషించుకుంటాయి.

వర్షాకాలంలో ప్రతి రోజూ ఒక కప్పు తులసి టీ తాగితే ఏం జరుగుతుంది?

వైట్ రైస్ కు బదులు బ్రౌన్ రైస్ తింటే.. జరిగేదిదే..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 09 , 2024 | 03:20 PM