Share News

Hyderabad: పాత నాణేలు, కరెన్సీ సేకరణ అతని హాబీ...

ABN , Publish Date - Aug 15 , 2024 | 10:24 AM

స్నేహితునికి పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంటున్నారా.... అయితే అతని పుట్టినరోజు సంవత్సరానికి సంబంధించిన రూపాయి నోటును బహుమతిగా ఇస్తే ఎలా ఉంటుంది.

Hyderabad: పాత నాణేలు, కరెన్సీ సేకరణ అతని హాబీ...

హైదరాబాద్: స్నేహితునికి పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంటున్నారా.... అయితే అతని పుట్టినరోజు సంవత్సరానికి సంబంధించిన రూపాయి నోటును బహుమతిగా ఇస్తే ఎలా ఉంటుంది.

వివరాల్లోకి వెళితే.. మారేడుపల్లి కృష్ణపురి కాలనీ(Maredupalli Krishnapuri Colony)కి చెందిన వేణుగోపాల్‌ (85) అనే వృద్ధుడు గత కొన్ని ఏళ్లుగా కాయిన్స్‌ ఎగ్జిబిషన్‌లోనే కాకుండా దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి పూర్వకాలం నాటి పాత అరుదైన నాణాలను రూపాయలను సేకరించడం అలవాటుగా మారింది. 1948 సంవత్సరా కాలం నాటి నయా పైసాతో కూడిన నాణేలతో పాటు రాగి. పంచలోహలు, ఇత్తడి, తదితర నమూనాలు ఇతని వద్ద దర్శనమిస్తున్నాయి.

ఇదికూడా చదవండి: Hyderabad: నిలిచిన వైద్యసేవలు...


అదేవిధంగా రూపాయి నోటు మొదలుకొని ప్రస్తుతం కొనసాగుతున్న నోట్లు సైతం ఇతని వద్ద ఉండడం గమనార్హం. ఈస్ట్‌ ఇండియా, బ్రిటీష్‌ ఇండియా(East India, British India), విజయనగరం, మొగుల్‌ చక్రవర్తులు, నిజాం కాలం నాటి నాణాలను సేకరించి ఆసక్తి కలిగిన వారికి అమ్ముతున్నాడు. కార్ఖానా ప్రధాన రహదారిలో గల సుధాకర్‌ టిఫిన్‌ సెంటర్‌ వద్ద అతను సేకరించే నాణేలను అమ్ముతూ సంతోషం వ్యక్తం చేశారు. ఎలాంటి విలువ గల నోటు కావాలన్నా ఇస్తాడు. దీంతో నాణాలను చూసిన వారందరూ చిన్ననాటి జ్ఞాపకాలను స్మరించుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు.


అదేవిధంగా పుట్టిన సంవత్సరం ఒక రూపాయి నోటు దొరకాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టతరమైనప్పటికీ ఇతని వద్ద ఈజీగానే లభిస్తుంది. ఇలా అరుదైన నాణాలు, పాత రూపాయలు తీసుకోవాలనుకున్నవారు కోరినంత డబ్బు ఇచ్చి నాణేలను ఇతని వద్ద నుంచి తీసుకుంటారు. ఇష్టమైనవారికి నాణాలను అమ్మడం వారి సంతోషానికి అనుభూతి కలిగిస్తుందని బుధవారం ఆంధ్రజ్యోతి విలేకరితో వివరాలు వెల్లడిస్తూ ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మీకు అవసరమనుకుంటే 799589922 నెంబర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 15 , 2024 | 10:24 AM