Share News

Life Lesson: జీవితం మెరుగ్గా ఉండాలంటే ఈ 7 విషయాలను వదిలేయడం మంచిది..!

ABN , Publish Date - Jul 01 , 2024 | 12:18 PM

అనుకున్నట్టు ఎవరి జీవితం ఉండదు. కొందరికి ఆర్థిక సమస్యలు ఉంటే.. మరికొందరికి మానసిక ప్రశాంతత కరువవుతుంది. జీవితంలో సంతోషమే లేదని మరికొందరు వాపోతుంటారు. ఎంత ప్రయత్నం చేసినా విజయం సాధించలేకపోతున్నామని ఇంకొందరు అంటుంటారు. అయితే జీవితం మెరుగ్గా ఉండాలన్నా, జీవితంలో సమస్యలు ప్రభావితం చేయకూడదన్నా..

Life Lesson:  జీవితం మెరుగ్గా ఉండాలంటే ఈ 7 విషయాలను వదిలేయడం మంచిది..!

జీవితం మెరుగ్గా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ అనుకున్నట్టు ఎవరి జీవితం ఉండదు. కొందరికి ఆర్థిక సమస్యలు ఉంటే.. మరికొందరికి మానసిక ప్రశాంతత కరువవుతుంది. జీవితంలో సంతోషమే లేదని మరికొందరు వాపోతుంటారు. ఎంత ప్రయత్నం చేసినా విజయం సాధించలేకపోతున్నామని ఇంకొందరు అంటుంటారు. అయితే జీవితం మెరుగ్గా ఉండాలన్నా, జీవితంలో సమస్యలు ప్రభావితం చేయకూడదన్నా కొన్ని విషయాలను వదిలిపెట్టాలని లైఫ్ స్టైల్ నిపుణులు అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే..

అపరాధభావం..

గతంలో ఏవైనా తప్పులు చేసి ఉంటే వాటి గురించి అపరాధ భావాన్ని మనసులో ఉంచుకోవడం మంచిది కాదు. అది మనిషి వ్యక్తిత్వాన్ని, మనసును బలహీనపరుస్తుంది. గతంలో జరిగిన విషయాల నుండి తప్పులు తెలుసుకుని వాటి నుండి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలి తప్ప, తప్పు చేశామని మనసులో కుమిలిపోకూడదు. ఇది భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంది.

Monsoon Food: వర్షాకాలపు అనారోగ్యాలకు ఈ 5 కూరగాయలే కారణం.. వీటిని తినకండి..!



పోలిక..

తమను తాము ఇతరులతో పోల్చుకునే వ్యక్తులు జీవితంలో మెరుగ్గా ఉండలేరు. ఇది మనిషి అసమర్థతకు, అసంతృప్తికి దారితీస్తుంది. ప్రతి ఒక్కరికి సొంత ప్రతిభ, సొంత ఆలోచన, సొంత ప్రయత్నాలు ఉండాలి. ఇవి భవిష్యత్తుకు గొప్పగా దోహదపడతాయి.

గతం..

గతంలో జరిగిన విషయాల గురించి ఆలోచించడం, ఆ ఆలోచనలలోనే కాలం వెళ్లబుచ్చడం మూర్ఖుల లక్షణం. గతం గురించి ఆలోచిస్తూ వర్తమానాన్ని కూడా వ్యర్థం చేసుకుంటారు. ఇది భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఏమాత్రం సంతోషం కనిపించదు.

ఓటమి భయాలు..

చాలామంది ఏవైనా ప్రయత్నాలు చేయాలంటే వెనకడుగు వేయడానికి ఓటమి భయాలే ప్రధాన కారణాలు. కొన్నిసార్లు చేతిముందు అవకాశం ఉన్నా ప్రయత్నించడానికి భయపడతారు. ఓటములు తరచుగా వచ్చి పోయేవే.. ప్రయత్నం చేయకుంటే విజయం అనేది సాధించలేం అని అర్థం చేసుకోవాలి.

Curry Leaves: రోజూ ఉదయాన్నే ఒక రెమ్మ పచ్చి కరివేపాకులు నమిలి తింటే జరిగేది ఇదే..!



సెల్ఫ్ చెక్..

సెల్ఫ్ చెక్ అనేది ప్రతి వ్యక్తికి చాలా అవసరం. అయితే తన గురించి తాను నెగిటివ్ గా సెల్ఫ్ చెక్ చేసుకునే వ్యక్తి జీవితంలో మెరుగ్గా ఉండలేడు. ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ ను దెబ్బతీస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంది.

పర్ఫెక్ట్..

చాలామంది తాము ఫర్పెక్ట్ గా ఉండాలని, ఫర్పెక్షనిస్ట్ అని పిలిపించుకోవాలని తహతహలాడుతుంటారు. అయితే ఎవరూ అన్ని విషయాలలోనూ, అన్ని సమయాల్లోనూ పర్పెక్ట్ గా ఉండరు. చేస్తున్న పనిలో పురోగతి ఉందా? విషయాన్ని అర్థం చేసుకోవడంలో ఎంత మెరుగయ్యారు? పని పట్ల ఎంత నిబద్ధతగా ఉన్నారు? ఇవన్నీ గమనించుకోవాలి తప్ప ఫర్పెక్ట్ అనే ట్యాగ్ కోసం ఆరాటపడకుడదు.

ఫిర్యాదులు..

చిన్న చిన్న విషయాలకు కంప్లైంట్ చేయడం కొందరికి అలవాటు. ఇలాంటి అలవాటు ఉన్నవారు జీవితంలో మెరుగ్గా, సంతోషంగా ఉండలేరు. ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే మానేయడం మంచిది. చిన్న చిన్న విషయాలకు కంప్లైంట్ చేస్తుంటే నెగిటివ్ ఆలోచన పెరుగుతుంది. ఇది మానసిక స్థితిని దిగజార్చుతుంది.

Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో పొరపాటున కూడా వీటిని తినకండి..!


మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 01 , 2024 | 01:02 PM