Viral Video: ఐకమత్యం లేకపోతే ఇలాగే ఉంటుంది.. కలిసి వేట.. తినే టైమ్‌లో గొడవ.. చివరకు ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Sep 22 , 2024 | 01:20 PM
ఐకమత్యమే మహా బలం అంటారు. ఒకరు చేయలేని పనిని నలుగురు కలిస్తే సులభంగా చేయవచ్చు. దీనినే ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో టీమ్ వర్క్ అని అంటుంటారు. అయితే ఐకమత్యం చెడితే మాత్రం ప్రత్యర్థులే లాభపడతారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆ విషయం సంపూర్ణంగా అర్థమవుతుంది.
ఐకమత్యమే మహా బలం అంటారు. ఒకరు చేయలేని పనిని నలుగురు కలిస్తే సులభంగా చేయవచ్చు. దీనినే ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో టీమ్ వర్క్ (Team Work) అని అంటుంటారు. అయితే ఐకమత్యం చెడితే మాత్రం ప్రత్యర్థులే లాభపడతారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆ విషయం సంపూర్ణంగా అర్థమవుతుంది. ఐదు సింహాల మధ్య పంపకాల విషయంలో సమన్వయం లోపించడంతో ఓ అడవి గేదె ప్రాణాలతో బయటపడింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. అడవిలో ఐదు సింహాలు ఒక దున్నపోతుపై అటాక్ చేశాయి. ఐదూ కలిసి ఆ దున్నపోతును సులభంగా పట్టుకున్నాయి. ఇక దానిని చంపేసి తినడమే తరువాయి. అయితే పంపకాల విషయంలో వాటి మధ్య గొడవ మొదలైంది. దీంతో ఒకదానిపై మరొకటి దాడి చేసుకోవడం ప్రారంభించాయి. మొదట రెండు సింహాల మధ్య మొదలైంది. చివరకు గొడవ క్రమంగా అన్ని సింహాలకు వ్యాపించింది. కష్టపడి పట్టుకున్న దున్నపోతును వదిలేసి మరీ గొడవ పడడం ప్రారంభించాయి. సింహాలు ఫైటింగ్ చేసుకుంటుండగా దున్నపోతు లేచి చక్కగా వెళ్లిపోయింది.
animalfactsinfo అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోకు మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. 1.45 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ఆ దున్నపోతు చావు నుంచి తప్పించుకుని వచ్చింది``, ``టీమ్ వర్క్ లేకపోతే ఇలాగే ఉంటుంది``, ``ఇది ఎంతో గొప్ప పాఠం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: షాకింగ్ వీడియో.. కళ్ల ముందే భూమిలోకి వెళ్లిపోయిన ట్రక్.. డ్రైవర్ ఎలా బయటపడ్డాడంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..