Share News

Viral: 4 ఏళ్ల కూతురి ప్రాణాలతో వ్యక్తి చెలగాటం! తల్లిదండ్రులకు ఇది గుణపాఠం

ABN , Publish Date - Jul 26 , 2024 | 09:21 PM

4 ఏళ్ల చిన్నారిని ఒళ్లో కూర్చోపెట్టుకుని అత్యంత ప్రమాదకరంగా డ్రైవ్ చేస్తున్న ఓ వ్యక్తి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అతడి చేస్తున్న తప్పు ఏంటో చెబుతూ ఇతరుల్లో అవగాహన కల్పించేందుకు ఓ వైద్యులు ఈ వీడియోను షేర్ చేశారు.

Viral: 4 ఏళ్ల కూతురి ప్రాణాలతో వ్యక్తి చెలగాటం! తల్లిదండ్రులకు ఇది గుణపాఠం

ఇంటర్నెట్ డెస్క్: కారు డ్రైవ్ చేస్తున్నాడో వ్యక్తి.. అతడి ఒళ్లో ముద్దులొలికే 4 ఏళ్ల పాప. తండ్రితో వచ్చిరానీ మాటల్లో ఎన్నో కబుర్లు చెబుతోంది. చిన్నారిని చూస్తూ తండ్రి కూడా అంతే సంబరపడిపోతున్నాడు. తండ్రీబిడ్డల బంధం కళ్లకుకట్టినట్టు చూపించే దృశ్యం ఇది. కానీ నెటిజన్లు మాత్రం ఆ తండ్రిని తెగ తిట్టిపోస్తున్నారు. బిడ్డ ప్రాణాలతో చెలగాటమాడుతున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ డాక్టర్ షేర్ చేసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట సంచలనంగా (Viral) మారింది. జనాలు గగ్గోలు పెట్టేలా చేస్తోంది.

Viral: రెండేళ్ల క్రితం తిన్న మిరపకాయ ఎంత పని చేసిందీ! ఇతడి పరిస్థితి చూస్తే..


అశ్విన్ రజినీశ్ అనే వైద్యుడు ఈ వీడియోను షేర్ చేశారు. చిన్నారులను ఒళ్లో కూర్చోపెట్టుకుని కారు తోలడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. యాక్సిడెంట్ జరిగితే చిన్నారి తల సుమారు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో తండ్రి ఛాతిని ఢీకొడుతుంది. దీంతో, తండ్రి ఛాతి పగలి ఇద్దరు హఠాన్మరణం పొందొచ్చని హెచ్చరించారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి మాత్రమే ఈ వీడియో పోస్టు చేస్తున్నట్టు మరీ మరీ చెప్పాడు. ఇది తప్ప తనకు మరెలాంటి ఉద్దేశం లేదని అన్నాడు. ఈ విషయాలు తల్లిదండ్రులు అందరూ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశాడు (Man Slammed For Driving With Kid On Lap).

కాగా, వీడియో పోస్టు చేసిన ఒక్క రోజులోనే విపరీతంగా వైరల్ అయిపోయింది. సుమారు నాలుగు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వైద్యుడి కోణం చూసి అనేక మంది తమ తప్పు తెలుసుకున్నారు. కన్నబిడ్డలను ఇంతటి ప్రమాదంలోకి నెడుతున్నామన్న స్పృహ తమకు తెలీకపోయిందని కామెంట్ చేశారు.


ఇలాంటి ఘటనలను నిరోధించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని కొందరు సూచించారు. డ్రైవింగ్ జారీ చేసే ముందే, యాక్సిడెంట్ల తీరుతెన్నులు, ఎయిర్‌బ్యాగు తెరుచుకునే తీరును ప్రజలకు వివరించడం తప్పనిసరి చేయాలని అన్నారు.

ఇక నెటిజన్లలో కొందరు వీడియోలోని వ్యక్తిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రీల్స్, షార్ట్ వీడియోల కోసం బిడ్డ ప్రాణాలతో చెలగాటమాడాడని తిట్టిపోశారు. యాక్సిడెంట్ దాకా అవసరం లేదని, కేవలం సడెన్‌గా బ్రేక్ వేస్తేనే చిన్నారికి పెను ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇలాంటి ప్రమాదకర డ్రైవింగ్‌తో తాము గతంలో గుణపాఠాలు నేర్చుకున్నామని కొందరు చెప్పారు. తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. ఇక వీడియోలోని వ్యక్తి పరధ్యానంగా డ్రైవ్ చేస్తున్నట్టు ఉందని కూడా కొందరు అభిప్రాయపడ్డారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.

Read Viral and Telugu News

Updated Date - Jul 26 , 2024 | 09:21 PM