Viral Video: ఆహా.. లెక్కలు ఇలా చెబితే ఎలా మర్చిపోతాం.. పాటలు పాడుతూ మ్యాథ్స్ చెబుతున్న టీచర్.. నెటిజన్లు ఫిదా..
ABN , Publish Date - Oct 06 , 2024 | 04:18 PM
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో టీచర్ పిల్లలకు వినూత్న పద్ధతిలో మ్యాథ్స్ బోధిస్తున్నాడు. లెక్కలను పాటల రూపంలో చెబుతూ ఆకట్టుకుంటున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
చదువుకునే సమయంలో చాలా మంది గణితం (Mathematics) అంటే భయపడిపోతుంటారు. ఆ లెక్కల ఫార్ములాలు, ఎక్కాలు గుర్తు పెట్టుకోలేక సతమతమవుతుంటారు. లెక్కల టీచర్లు (Maths Teacher) చెప్పేవి అర్థం కాక ఎప్పుడూ తక్కువ మార్కులు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే పిల్లలకు అర్థమయ్యేలా చెబితే వారు మాత్రం ఎందుకు అర్థం చేసుకోరు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో టీచర్ పిల్లలకు వినూత్న పద్ధతిలో మ్యాథ్స్ బోధిస్తున్నాడు. లెక్కలను పాటల రూపంలో చెబుతూ ఆకట్టుకుంటున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు (Viral Video).
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మ్యాథ్స్ టీచర్ క్లాస్ రూమ్‌లో పిల్లలకు త్రికోణమితి చెబుతున్నాడు. అయితే కఠినమైన పాఠంలా కాకుండా, చక్కగా హిందీ పాటల రూపంలో బోధిస్తున్నాడు. ప్రముఖ కవిత ``కోయీ దివానా కెహతా హై`` ట్యూన్‌లో త్రిభుజానికి సంబంధించిన బాహ్య కోణాలను వివరిస్తున్నాడు. పిల్లలు కూడా పాట రూపంలో ఆ విషయాలను గుర్తుంచుకుంటారని ఆ టీచర్ ఇలా వినూత్నంగా ప్లాన్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫేస్‌బుక్ పేజీలో ఈ వీడియో షేర్ అయింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆ టీచర్‌పై ప్రశంసలు కురిపించారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను ఇప్పటివరకు 70 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోలోని టీచర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ``లెక్కలు అర్థమయ్యేలా చెప్పడానికి ఇది మంచి మార్గం``, ``ఉపాధ్యాయులందరూ ఇంత హృదయపూర్వకంగా బోధిస్తే, ప్రభుత్వ పాఠశాలల పిల్లలు చాలా ముందుకు వెళతారు``, ``ఈ టీచర్ భోదనా శైలికి సెల్యూట్``, ``పిల్లల పురోగతి కోసం ఆలోచించే గురువులు దేవుడితో సమానం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: సింహం బోనులో చెయ్యి పెడితే.. ఓ మూర్ఖుడికి తగిన శాస్తి చేసిన మృగరాజు.. వీడియో చూస్తే..
Viral Video: వావ్.. సూపర్ టెక్నిక్.. ఉడికించిన బంగళాదుంపల తొక్కలను ఎంత సింపుల్‌గా తీసిందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.