Share News

Tibet: మన కళ్ల ముందే పరిణామ క్రమం.. టిబెట్ మహిళల శరీరతత్వంపై వెలువడిన ఆసక్తికర పరిశోధన..

ABN , Publish Date - Oct 23 , 2024 | 11:26 AM

కొన్ని వేల ఏళ్ల క్రితం మహాసముద్రాల అడుగున మొదటి జీవ కణాలు ఉద్భవించిన రోజుల నుంచి ఇప్పటివరకు ఈ పరిణామ క్రమం నిశబ్దంగా జరిగిపోతూనే ఉంది. చార్లెస్ డార్విన్ వివరించిన పరిణామ క్రమం ఎన్నో ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది.

Tibet: మన కళ్ల ముందే పరిణామ క్రమం.. టిబెట్ మహిళల శరీరతత్వంపై వెలువడిన ఆసక్తికర పరిశోధన..
Evolution in Tibetan women

మానవ పురోగతికి కారణం పరిణామ క్రమం (Evolution). కొన్ని వేల ఏళ్ల క్రితం మహాసముద్రాల అడుగున మొదటి జీవ కణాలు ఉద్భవించిన రోజుల నుంచి ఇప్పటివరకు ఈ పరిణామ క్రమం నిశబ్దంగా జరిగిపోతూనే ఉంది. చార్లెస్ డార్విన్ వివరించిన పరిణామ క్రమం ఎన్నో ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం మన కళ్ల ముందు కూడా టిబెట్‌ (Tibet)లో జరుగుతున్న ``ఎవెల్యూషన్`` గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్శిటీ తాజాగా టిబెట్ మహిళలపై (Tibetan women) చేసిన పరిశోధన (Study) ఎన్నో ఆసక్తికర విషయాలను వెలుగులోకి తెచ్చింది.


మానవులకు నివాసయోగ్యం కాని ప్రతికూల వాతావరణం కలిగిన ప్రాంతాలలో టిబెట్ పీఠభూమి (Tibetan plateau) కూడా ఒకటి. అతి ఎత్తైన ఈ ప్రాంతంలో ఆక్సిజన్ (oxygen) కొరత చాలా ఎక్కువగా ఉంటుంది. గాలి పీల్చుకోవడానికి కూడా ఎంతో కష్టపడాలి. దాదాపు పది వేల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ప్రజలు నివసిస్తున్నారు. ఇన్ని వేల సంవత్సరాల కాలంలో అక్కడి ప్రజల శరీరాలు అక్కడి వాతావరణానికి అనుగుణంగా పరిణామం చెందాయట. ఆక్సిజన్ డెలివరీని పెంచే లక్షణాలు వారి శరీరంలో అభివృద్ధి చెందాయట.


నేపాల్‌లోని ఎగువ ముస్తాంగ్‌లో 12,000-14,000 అడుగుల ఎత్తులో నివసిస్తున్న 46- 86 సంవత్సరాల వయస్సు గల 417 మంది టిబెటన్ మహిళలను ఈ అధ్యయనకారులు పరిశీలించారు. ఆక్సిజన్ కొరత ఉండే ఎత్తైన ప్రాంతంలో నివసిస్తున్న మహిళల్లో పునురుత్పతి రేటు (Reproductive) సాధారణంగా ఎలా ఉందో పరిశీలించేందుకు అధ్యయనం చేశారు. ఆ మహిళల శరీరతత్వాన్ని అర్థం చేసుకునేందుకు పరిశోధకులు.. వారి పునరుత్పత్తి చరిత్రలు, శారీరక కొలతలు, డీఎన్‌ఏ నమూనాల డేటాను సేకరించారు. ఆరోగ్యకర పిల్లలకు జన్మనిచ్చిన మహిళల్లో ప్రత్యేకమైన రక్తం, హృదయ లక్షణాలు ఉన్నట్టు కనుగొన్నారు.


ఆయా మహిళల్లో విశాలమైన ఎడమ జఠరికలు ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని చాలా సమర్థంగా పంప్ చేస్తున్నాయట. ఈ స్త్రీలు దాదాపు సగటు హిమోగ్లోబిన్ స్థాయిలను కలిగి ఉన్నారు. అలాగే వీరిలో ఆక్సిజన్ శాచురేషన్ ఎక్కువగా ఉంది. అందువల్ల రక్తం యొక్క స్నిగ్ధత పెరగదు. ఫలితంగా గుండెపై అదునపు ఒత్తిడి పడకుండానే వారి శరీర భాగాలకు ఆక్సిజన్ డెలివరీ జరిగిపోతోంది. అలాగే వారి ఊపిరితిత్తులకు రక్తప్రవాహం కూడా ఎక్కువగా జరుగుతోందట. ఇలాంటి ప్రత్యేకతల కారణంగానే తక్కువ ఆక్సిజన్ ఉన్న ప్రాంతంలో కూడా అక్కడి మహిళలు పునరుత్పత్తి రేటు సాధారణంగానే ఉంది.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఏవమ్మా.. ఇంకెక్కడా ప్లేస్ దొరకలేదా? రోటీ ఎక్కడ చేస్తోందో చూడండి.. ఫన్నీ వీడియో షేర్ చేసిన గోయెంకా..


Viral Video: ట్రైన్‌లో ఏసీ కోచ్ ఎక్కి బెర్త్ దగ్గరకు వెళ్లిన వ్యక్తికి షాక్.. రైల్వే శాఖ స్పందన ఏంటంటే..


Optical Illusion: మీరు ఎంత వేగంగా ఆలోచించగలరు?.. ఈ ఫొటోలో తప్పును 4 సెకెన్లలో పట్టుకోండి..


Viral Video: పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లనని వధువు మారాం.. ఆమె సోదరుడు ఏం చేశాడో చూస్తే నవ్వాపుకోలేం..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Oct 23 , 2024 | 11:26 AM