Share News

Viral News: ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేశారు.. తీరా పార్సిల్ ఓపెన్ చేస్తే షాక్..

ABN , Publish Date - Jun 15 , 2024 | 11:17 AM

ప్రస్తుత కాలంలో అనేక మంది కొనుగోళ్ల కోసం ఆన్‌లైన్ షాపింగ్(online shopping) యాప్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చిన్న చిన్న వస్తువుల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద టీవీలు, ఫ్రిజ్ సహా అనేకం ఆన్‌లైన్‌లోనే బుక్ చేసి ఇంటి వద్ద డెలివరీ తీసుకుంటున్నారు. అయితే ఈ ఆన్‌లైన్ యాప్‌లలో బుక్ చేసిన వస్తువులు పలు మార్లు డెలివరీ చేసిన సమయంలో మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ఆర్డర్ చేస్తే దానికి బదులుగా ఇటుక రావడం, డ్రెస్ బుక్ చేస్తే ఇతర వస్తువులు వచ్చిన సంఘటనలు చుశాం.

Viral News: ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేశారు.. తీరా పార్సిల్ ఓపెన్ చేస్తే షాక్..
Amazon online and got three bar soaps

ప్రస్తుత కాలంలో అనేక మంది కొనుగోళ్ల కోసం ఆన్‌లైన్ షాపింగ్(online shopping) యాప్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చిన్న చిన్న వస్తువుల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద టీవీలు, ఫ్రిజ్ సహా అనేకం ఆన్‌లైన్‌లోనే బుక్ చేసి ఇంటి వద్ద డెలివరీ తీసుకుంటున్నారు. అయితే ఈ ఆన్‌లైన్ యాప్‌లలో బుక్ చేసిన వస్తువులు పలు మార్లు డెలివరీ చేసిన సమయంలో మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ఆర్డర్ చేస్తే దానికి బదులుగా ఇటుక రావడం, డ్రెస్ బుక్ చేస్తే ఇతర వస్తువులు వచ్చిన సంఘటనలు చుశాం.

ఈ నేపథ్యంలోనే ఇటివల ఓ వ్యక్తి అమెజాన్ ఆన్‌లైన్ ప్లాట్ ఫాంలో Vivo Y20A స్మార్ట్ ఫోన్ ఆర్డర్ చేస్తే వచ్చిన పార్సిల్ చూసి షాకయ్యారు. దానిలో ఫోన్‌కు బదులుగా మూడు సబ్బులు ఉన్న బాక్స్ వచ్చింది. దీంతో వారు సహాయం కోసం సంబంధిత ఆన్‌లైన్ యాప్‌లో సంప్రదించడంతోపాటు సోషల్ మీడియా(social media)లో కూడా షేర్ చేశారు.

దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ విషయంలో ఆయా కంపెనీ నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని ఓ వ్యక్తి పోస్ట్‌ చేశారు. ఇది మొదటి సంఘటన కాదని, ఇంతకుముందు కూడా ఇలాంటివి చాలా వెలుగులోకి వచ్చాయని మరోకరు అన్నారు. భరూచ్‌లోని జంబూసర్‌లో ఒక యువకుడు ఆన్‌లైన్‌లో ఐ ఫోన్ ఆర్డర్ చేస్తే అతనికి కూడా సబ్బులు వచ్చాయని వెల్లడించారు. ఇలా అనేక మంది వారి వారి అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.

వేల రూపాయలు పెట్టి విలువైన ఫోన్లను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే అవి డెలివరీ కాకపోవడంతో వినియోగదారులు(customers) అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమస్యలు పలుమార్లు వెంటనే పరిష్కారం అవుతుండగా, మరికొన్ని సార్లు మాత్రం చాలా ఆలస్యమవుతున్నాయని ఇంకొంత మంది అంటున్నారు. ఇలాంటి సంఘటన మీకు కూడా ఎదురైందా లేదా అనేది కామెంట్(comment) రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి:

EPFO Withdrawal Rule: పీఎఫ్ విత్ డ్రా రూల్స్ మారాయ్.. వెంటనే చెక్ చేసుకోండి!

Gold and Silver Rate: బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్..ఈసారి ఎంతంటే..

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 15 , 2024 | 11:21 AM