Share News

Parenting: పిల్లల పెంపకంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. పిల్లలు దూరమవుతారు..!

ABN , Publish Date - Jul 14 , 2024 | 08:21 AM

. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేవిధానం మీదనే పిల్లల క్రమశిక్షణ, పిల్లలలో విలువలు, వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో భాగంగా చేసే కొన్ని పనులు పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య దూరాన్ని పెంచుతాయి.

Parenting: పిల్లల పెంపకంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. పిల్లలు దూరమవుతారు..!

పిల్లల పెంపకం ఒక కళ. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేవిధానం మీదనే పిల్లల క్రమశిక్షణ, పిల్లలలో విలువలు, వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో భాగంగా చేసే కొన్ని పనులు పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య దూరాన్ని పెంచుతాయి. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు కొన్ని పనులు ప్రేమతో చేసినా అవి పిల్లలకు ఇబ్బందిగానూ, అసౌకర్యంగానూ, వారి స్వేచ్ఛకు ఆటంకంగానూ అనిపిస్తాయి. కొన్నిసార్లు పిల్లలు మితిమీరి స్వేచ్ఛను కోరుకోవడానికి కూడా కారణం అవుతాయి. కాబట్టి పిల్లలను పెంచే విషయంలో ఈ కింది 4 తప్పులను మాత్రం పొరపాటున కూడా చేయకూడదట.

బ్యాగులు, బాటిళ్లలో వచ్చే ఈ తెల్లని ప్యాకెట్లతో ఇన్ని లాభాలా?


ఓవర్ కేరింగ్..

తల్లిదండ్రులన్నాక పిల్లల విషయంలో కేరింగ్ గా ఉంటారు. అయితే అతిగా కేరింగ్ చూపిస్తే మాత్రం పిల్లలు ఇబ్బంది ఫీల్ అవుతారు. అతిగా కేరింగ్ చూపించడం పిల్లలకు నిర్బందంలాగా అనిపిస్తుంది. దీనివల్ల పిల్లలు అతి స్వేచ్ఛను కోరుకుంటారు. తల్లిదండ్రుల నుండి పారిపోవాలని చూస్తుంటారు.

పరిష్కారం..

పిల్లలు హోం వర్క్ చేయడం నుండి వారు ఏదైనా సమస్యలో ఉన్నప్పటి వరకు ప్రతి విషయంలో తల్లిదండ్రులు జోక్యం చేసుకోవడం, పిల్లలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో తల్లిదండ్రులే వాటిని పూర్తీ చేయడం చేస్తుంటారు. దీనివల్ల పిల్లలు ఏమీ నేర్చుకోలేరు. చేతకాని వాళ్ళుగా తయారవుతారు. ఎప్పుడూ ఇతరుల మీద ఆధారపడే స్వభావం కలిగి ఉంటారు.

జాపత్రిని ఆహారంలో భాగం చేసుకుంటే కలిగే ప్రయోజనాలివే..!


నియంత్రణ..

పిల్లలను నియంత్రించడం మంచిదే.. కానీ అతిగా నియంత్రిస్తే వారు స్వతహాగా నేర్చుకునే స్వభావాన్ని అలవర్చుకోలేరు. ప్రతిదీ తల్లిదండ్రులు చెప్పినట్టు చేస్తూ ఉంటే వారికి సమస్యలు ఎదురైనప్పుడు కూడా సొంతంగా ఆలోచించి ఏదీ పరిష్కరించుకోలేరు. అందుకే పిల్లలను అతిగా నియంత్రించకూడదు. వారికి తగినంత స్వేచ్చనివ్వాలి.

పొగడ్తలు..

పొగడటం ద్వారా క్రమశిక్షణలో ఉంచడం, పని చేయించడం కొందరి అలవాటు. అయితే ప్రతి దానికి పొగడటం అనే అలవాటు మంచిది కాదు. అలాగే కేవలం పొగడటం మాత్రమే చేసి తప్పులు చేసినప్పుడు చూసి చూడకుండా ఉండటం కూడా మంచిది కాదు. మంచి పని చేసినప్పుడు పొగడటం, తప్పు చేస్తే మందలించడం, ఓటమి సమయాలలో ప్రోత్సహించడం చేయాలి.

తెల్ల జట్టును మూలాల నుండి నల్లగా మార్చే సూపర్ టిప్స్..!

ఈ 6 సమస్యలు ఉన్నవారు సొరకాయ పొరపాటున కూడా తినకూడదు..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 14 , 2024 | 12:23 PM