Share News

Viral Video: ఆహా.. ద్వాపర యుగం నాటి సీన్ రిపీట్.. ఆవుల ముందు నెమలి నాట్యం ఎలా చేసిందో చూడండి..!

ABN , Publish Date - Jul 17 , 2024 | 09:28 AM

ఎంతటి ఫాస్ట్ యుగంలో బతుకుతున్నా, ఎంత టెక్నాలజీ మత్తులో మునిగిపోయినా ప్రకృతి అందాలకు దాసోహం కాని వారు ఉండరు. పచ్చని ప్రకృతిలో ఆవులు, గేదెల మధ్య ఉండడం, సాయంత్రం అందమైన పక్షులను చూడడం, నెమలి నాట్యాన్ని వీక్షించడం ఎంతో మధురానుభూతులను కలిగిస్తాయి.

Viral Video: ఆహా.. ద్వాపర యుగం నాటి సీన్ రిపీట్.. ఆవుల ముందు నెమలి నాట్యం ఎలా చేసిందో చూడండి..!
Peacock dance

ఎంతటి ఫాస్ట్ యుగంలో బతుకుతున్నా, ఎంత టెక్నాలజీ మత్తులో మునిగిపోయినా ప్రకృతి (Nature) అందాలకు దాసోహం కాని వారు ఉండరు. పచ్చని ప్రకృతిలో ఆవులు, గేదెల మధ్య ఉండడం, సాయంత్రం అందమైన పక్షులను చూడడం, నెమలి నాట్యాన్ని వీక్షించడం ఎంతో మధురానుభూతులను కలిగిస్తాయి. అలాంటి దృశ్యాలు ఇప్పుడు చాలా అరుదైపోయాయి. అయితే ప్రస్తుతం ఓ అందమైన వీడియో చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


cowsblike అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను పొలం మధ్యలో చిత్రీకరించారు. పొలం గట్టు మీద రెండు ఆవులు (Cows) గడ్డి మేస్తున్నాయి. వాటి ఎదురుగా ఓ నెమలి (Peacock) పురి విప్పి నాట్యం చేస్తోంది. ఒక ఆవు ఆ నెమలి వెనుక వెళుతుండగా.. నెమలి ముందుకు పరిగెడుతోంది. నెమలిని ఆవు ఆట పట్టిస్తున్నట్టుగా వెంబడిస్తోంది. ఆవుకు అందకుండా నెమలి అందంగా పరిగెడుతోంది. ఈ అరుదైన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 1.14 కోట్ల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. 21 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందలను తెలియజేశారు. ``ద్వాపర యుగాన్ని తలపిస్తోంది``, ``కళ్ళు మూసుకుని, శ్రీ కృష్ణుడు తన వేణువును వాయిస్తున్నట్లు భావించు``, ``ఎంతో రమణీయ దృశ్యం``, ``అద్భుతమైన వీడియో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion: ఏకాగ్రతతో వెతికితే తప్ప ఈ ఫొటోలోని కేక్ పీస్ పట్టుకోలేరు.. 10 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral Video: షాపింగ్ చేస్తున్న అమ్మాయిలు.. లోపలికి వచ్చిన రెండు ఎద్దులు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో చూస్తే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 17 , 2024 | 09:28 AM