Share News

Viral: మెట్రో రైళ్లల్లోనూ ఈ మరకలా.. నెటిజన్లలో పెల్లుబుకుతున్న ఆగ్రహం.. జరిగిందేంటంటే..

ABN , Publish Date - Apr 11 , 2024 | 08:51 PM

మెట్రో రైల్లో కూడా గుట్కా మరకలు కనిపించడం నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Viral: మెట్రో రైళ్లల్లోనూ ఈ మరకలా.. నెటిజన్లలో పెల్లుబుకుతున్న ఆగ్రహం.. జరిగిందేంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: దేశాన్ని పట్టిపీడిస్తున్న అనేక జాడ్యాల్లో గుట్కా కూడా ఒకటి. అనేక మంది గుట్కాలు తిని ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తూ పరిసరాలను అపరిశుభ్రంగా మారుస్తుంటారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల విషయంలో పరిస్థితి మరింత దారుణం. ప్రజల్లో మార్పు కోసం ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా, సోషల్ మీడియాలో ఎంత ప్రచారం జరుగుతున్నా ఆశించిన పురోగతి మాత్రం కనిపించడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా మెట్రో కోచ్‌లో కూడా గుట్కా మరకలు కనిపించడం ప్రస్తుతం సంచలనంగా (Viral) మారింది.

Viral: విమానంలో రెచ్చిపోయిన లవర్స్.. 4 ఖాళీ సీట్లను మంచంలా వాడేసుకుంటూ.. పబ్లిక్‌గా..


ఘటన ఎక్కడ జరిగిందో తెలీదు కానీ గార్గ చటర్జీ అనే నెటిజన్ ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకున్నారు. ఆ చిత్రంలో మెట్రో డోర్‌పై ఎవరో గుట్కా తిని ఉమ్మేసిన మరక కనిపిస్తోంది. ‘‘మోట్రోలకు కూడా ఈ జాడ్యం పాకినట్టు ఉంది. ఇందుకు బాధ్యుడైన క్రిమినల్‌ను కటకటాల పాటు చేయండి’’ అంటూ గార్గ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో చెప్పగలరా అంటూ నెటిజన్లకు అతడో ప్రశ్న కూడా సంధించాడు. అది ఏ మెట్రో అనేది మాత్రం అస్సలు బయటపెట్టలేదు (Gutka stains on Metro rail door).

Viral: అప్పుడే పుట్టిన మనవడిని చూడగానే అత్తకు డౌట్.. కోడలికి బలవంతంగా డీఎన్‌ఏ టెస్టు చేయిస్తే..


ఇక ఘటన గురించి తెలిశాక నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. పోస్టుకు పెద్ద ఎత్తున స్పందన రావడంతో రోజుల వ్యవధిలోనే 5 లక్షల పైచిలుకు వ్యూస్ వచ్చేశాయి. కొందరు ఏకంగా గుట్కా కంపెనీలపైనే విమర్శలు గుప్పించారు. ప్రభుత్వాలు ఈ సంస్థలను బ్యాన్ చేయాలని కొందరు డిమాండ్ చేశారు. ఇలాంటి వారి వివరాలను బహిరంగ పరిచి దుమ్ముదులపకపోతే ఈ దురలవాటుకు ముకుతాడు వేయలేమని కొందరు అన్నారు. ఇలా ఉమ్మేసే వారితోనే ఆ మరకలను శుభ్రం చేయించాలని కొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Viral: చిరుతకే షాకిచ్చిన రైతు.. బిత్తరపోయిన క్రూర మృగం.. వైరల్ వీడియో

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 11 , 2024 | 08:59 PM