Share News

Viral News: బయట ఆహారం సేఫేనా.. మొన్న వేలు, నిన్న కుళ్లిపోయిన మాంసం, నేడు ఎలుక కళేబరం

ABN , Publish Date - Jun 21 , 2024 | 02:52 PM

తాజాగా మరో గగుర్పొడిచే వార్త బయటకి వచ్చింది. అహ్మదాబాద్‌కు చెందిన కస్టమర్‌కి షాకింగ్‌ అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి నగరంలోని ప్రముఖ హోటల్‌ దేవి దోసా ఫుడ్‌ జాయింట్‌‌కు వెళ్లాడు. అక్కడ ఫుడ్‌ తీసుకోగా.. అతనికి సర్వ్‌ చేసిన సాంబార్‌ గిన్నెలో చచ్చిపోయిన ఎలుక కళేబరం కనిపించింది.

Viral News: బయట ఆహారం సేఫేనా.. మొన్న వేలు, నిన్న కుళ్లిపోయిన మాంసం, నేడు ఎలుక కళేబరం

ఢిల్లీ: బయట ఆహారం సురక్షితమేనా.. ఇప్పుడు సగటు భారతీయుడిని సందేహం ఇదే. ఈ మధ్య జరిగిన ఘటనలు చూస్తుంటే బయట ఆహారం జోలికి వెళ్లాలంటేనే భయపడేలా చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ముంబయికి చెందిన ఓ వైద్యుడు ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్‌లో మనిషి వేలు కనిపించగా.. ఆ తరువాత జరిగిన దాడుల్లో హోటళ్లలో కుళ్లిపోయిన మాంసం, ఆహార పదార్థాలు వాడుతున్న విషయం బయటపడింది.

తాజాగా మరో గగుర్పొడిచే వార్త బయటకి వచ్చింది. అహ్మదాబాద్‌కు చెందిన కస్టమర్‌కి షాకింగ్‌ అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి నగరంలోని ప్రముఖ హోటల్‌ దేవి దోసా ఫుడ్‌ జాయింట్‌‌కు వెళ్లాడు. అక్కడ ఫుడ్‌ తీసుకోగా.. అతనికి సర్వ్‌ చేసిన సాంబార్‌ గిన్నెలో చచ్చిపోయిన ఎలుక కళేబరం కనిపించింది.

దీంతో అతడు కంగుతిన్నాడు. కళేబరం దృశ్యాల్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతోంది. మరోవైపు ఈ ఘటనపై అమ్దవద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కి ఫిర్యాదు చేశారు. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు హోటల్‌ యజమానికి నోటీసులు జారీ చేశారు.

గగుర్పాటుకు గురి చేసే వరుస ఘటనలు బయటపడుతుండటంతో బయట ఆహారానికి దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. అధికారులు హోటళ్లలో నిత్యం తనిఖీ చేపట్టి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

For Latest News and National News click here

Updated Date - Jun 21 , 2024 | 06:22 PM