Share News

Rolls-Royce: రోల్స్ రాయిస్ అమ్మేసి ఆటో కొనుక్కోండి.. ఢిల్లీ రోడ్డుపై ఆగిపోయిన ఖరీదైన కారుపై నెటిజన్ల సెటైర్లు!

ABN , Publish Date - Jul 02 , 2024 | 01:11 PM

మనదేశంలోని అత్యంత ధనవంతులు ఆడి, బెంజ్, బెంట్లీ వంటి ఖరీదైన కార్లును వాడుతుంటారు. చాలా కొద్ది మంది మాత్రమే అత్యంత విలాసవంతమైన రోల్స్ రాయిస్ కార్లను ఉపయోగిస్తుంటారు. రాజసం ఉట్టిపడే ఆ కారు రోడ్డు మీద వెళ్తుంటే అందరూ చూస్తూ ఉండిపోవాల్సిందే.

Rolls-Royce: రోల్స్ రాయిస్ అమ్మేసి ఆటో కొనుక్కోండి.. ఢిల్లీ రోడ్డుపై ఆగిపోయిన ఖరీదైన కారుపై నెటిజన్ల సెటైర్లు!
Rolls-Royce got stuck on Delhi Road

మనదేశంలోని అత్యంత ధనవంతులు ఆడి, బెంజ్, బెంట్లీ వంటి ఖరీదైన కార్లును (Luxury car) వాడుతుంటారు. చాలా కొద్ది మంది మాత్రమే అత్యంత విలాసవంతమైన రోల్స్ రాయిస్ (Rolls-Royce) కార్లను ఉపయోగిస్తుంటారు. రాజసం ఉట్టిపడే ఆ కారు రోడ్డు మీద వెళ్తుంటే అందరూ చూస్తూ ఉండిపోవాల్సిందే. అయితే ఇండియన్ రోడ్ల మీద రోల్స్ రాయిస్ కార్లు ఎలా ఇబ్బంది పెడతాయో తెలిపే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Rolls-Royce got stuck on Delhi Road). ఢిల్లీ (Delhi)లోని నీటితో నిండిన రోడ్డుపై లగ్జరీ కారు చిక్కుకుపోయిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది (Viral Video).


ఢిల్లీలోని వర్షం కారణంగా నీటితో నిండిన రోడ్డుపై నల్లటి రోల్స్ రాయిస్ ఘోస్ట్ కార్ నిలిచిపోయింది. అదే రోడ్డుపై ఇతర వాహనాలు సజావుగా వెళ్లిపోతున్నాయి. ఈ ఖరీదైన రోల్స్ రాయిస్ మాత్రం ముందుకు వెళ్లనని మొరాయించింది. మారుతీ కారుపై వెళ్తున్న వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ``కారు ధర ఎంతనేది ఇక్కడ ముఖ్యం కాదు. మీరు అనుకున్నప్పుడు మీ వాహనాన్ని బయటకు తీసి ప్రయాణించగలుగుతున్నారా అనేదే పాయింట్. నీటితో నిండిన రోడ్డుపై రోల్స్ రాయిస్ ఆగిపోవడం బాధాకరం. దేశ రాజధానిలో మౌలిక వసతులు ఇలా ఉండడం విచారకరం`` అంటూ కామెంట్ చేశారు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. ``మీరు ఈ కారు అమ్మేసుకుని ఆటో కొనుక్కోండి``, ``విలాసవంతమైన కార్లు నీటిలో చిక్కుకున్నప్పుడు బ్రేకులు లాక్ అయిపోతాయి``, ``వర్షాకాలంలో ఇండియాలో ఇలాగే ఉంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వేగంగా వస్తున్న రైలు ముందు యువతి రీల్.. డ్రైవర్ ఆమెను ఎలా కాపాడాడో చూడండి..


Optical Illusion: ఈ ఫ్లెమ్మింగోల మధ్య ఉన్న హార్ట్ సింబల్‌‌ను కనిపెడితే మీ కళ్లకు తిరుగులేదు..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 02 , 2024 | 01:21 PM