Share News

Rosemary: జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయపడే రోజ్మేరీని ఇంట్లో ఇలా పెంచవచ్చు..!

ABN , Publish Date - Sep 27 , 2024 | 03:45 PM

చాలామంది రోజ్మేరీని పెంచుకోవాలని అనుకున్నామొక్కలు దొరకడం లేదని అంటూ ఉంటారు. అయితే రోజ్మేరీని చిన్న రెమ్మ సహాయంతో కూడా పెంచవచ్చు.

Rosemary: జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయపడే రోజ్మేరీని ఇంట్లో ఇలా పెంచవచ్చు..!
Rosemary

రోజ్మేరీ ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతోంది. చాలామంది రోజ్మేరీ జుట్టు పెరుగుదలకు మాత్రమే ఉపయోగపడుతుందని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది. దీన్ని చర్మ సంరక్షణలోనూ, ఆరోగ్య సంరక్షణలోనూ ఉపయోగిస్తారు. చాలామంది రోజ్మేరీని పెంచుకోవాలని అనుకున్నామొక్కలు దొరకడం లేదని అంటూ ఉంటారు. అయితే రోజ్మేరీని చిన్న రెమ్మ సహాయంతో కూడా పెంచవచ్చు. ఇంతకీ దీన్నెలా పెంచాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుంటే..

కీర దోసకాయ, టమాటో.. ఈ కాంబినేషన్ గురించి మీకు తెలియని నిజాలివీ..!


రోజ్మేరీని మొక్క లేకపోయినా చిన్నపాటి రెమ్మలు ఉన్నా వాటి సహాయంతో పెంచవచ్చు. ఇప్పట్లో చాలా రకాల ఆన్లైన్ షాపింగ్ సైట్లలో రోజ్మేరీ ఆకులు అందుబాటులో ఉంటున్నాయి. వీటిని కొనుగోలు చేసినా లేదా ఎక్కడైనా మొక్క నుండి రోజ్మేరీ ఆకులు సేకరించినా ఇంట్లోనే రోజ్మేరీ మొక్క పెంచవచ్చు.

రోజ్మేరీని బయటి నుండి కట్ చేసి ఉంటే మొదట దానిని ఇంట్లో వెచ్చని ప్రదేశంలో ఉంచాలి. ఒక కుండీ తీసుకుని అందులో కొబ్బరి పొట్టు, కంపోస్ట్ ఎరువు, మట్టి కలిపి వేయాలి. ఈ కుండీలో రోజ్మేరీని నాటాలి. రోజ్మేరీని నాటేటప్పుడు రోజ్మేరీ రెమ్మల కింది భాగంలో ఉండే ఆకులను తీసేయాలి.

రోజ్మేరీ రెమ్మలను నాటిన తరువాత 2 నుండి 3 వారాల పాటూ కుండీని కొద్దిగా తేమగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల రోజ్మేరీ రెమ్మలకు మెల్లిగా వేర్లు పెరుగుతాయి. తరువాత మొక్కలను సాధారణంగానే సంరక్షిస్తూ ఉంటే రోజ్మేరీ మొక్క బాగా ఎదుగుతుంది.

ఇవి కూాడా చదవండి..

ఈ ఒక్క డైట్ ప్లాన్ ఫాలో అయితే.. ఈజీగా బరువు తగ్గవచ్చు..!

ఇష్టపడే రంగును బట్టి మనుషుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 27 , 2024 | 03:45 PM