Share News

Viral Video: నాగుపాము పకోడీ.. ఇండోనేసియాలో స్నేక్ స్నాక్స్‌కు భారీ డిమాండ్.. ఆ షాప్‌లో పాములతో ఏం చేస్తున్నారంటే..

ABN , Publish Date - Aug 30 , 2024 | 04:09 PM

నాగుపాము పేరు వింటే చాలు జనాలు భయంతో వణికిపోతారు. అది కనబడితే పరుగులు తీస్తారు. అయితే ఇండోనేసియా రాజధాని జకర్తాకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా జనాలను ఆశ్చర్యపరుస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలోని ఓ వ్యక్తి పాములతో రకరకాల స్నాక్స్ తయారు చేస్తున్నాడు.

Viral Video: నాగుపాము పకోడీ.. ఇండోనేసియాలో స్నేక్ స్నాక్స్‌కు భారీ డిమాండ్.. ఆ షాప్‌లో పాములతో ఏం చేస్తున్నారంటే..
food stall where cobra pakoras are sold

నాగుపాము (King Cobra) అత్యంత విషపూరితమైన సర్పం. దాని పేరు వింటే చాలు జనాలు భయంతో వణికిపోతారు. అది కనబడితే పరుగులు తీస్తారు. అయితే ఇండోనేసియా (Indonesia) రాజధాని జకర్తాకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా జనాలను ఆశ్చర్యపరుస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలోని ఓ వ్యక్తి పాములతో రకరకాల స్నాక్స్ (Snake Snacks) తయారు చేస్తున్నాడు. ఆ ఫుడ్‌స్టాల్ దగ్గర నాగుపాము పకోడీలను (Cobra Pakora) తయారు చూస్తున్నాడు. ఆ వీడియో నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది (Viral Video).


Akash Chaudhary అనే కంటెంట్ క్రియేటర్ ఈ వీడియోను షేర్ చేశాడు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో, ఆకాష్ చౌదరి.. కోబ్రా పకోడీలను తినడానికి ప్రజలు ఎంత ఉత్సాహంతో అక్కడికి వస్తున్నారో చూపించాడు. అంతేకాదు ఆ ఫుడ్‌స్టాల్ దగ్గర జనాలు నాగుపాము రక్తాన్ని కూడా తాగుతున్నారట. అది తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా, చర్మానికి మంచి మెరుపు కూడా వస్తుందట. ఆ ఫుడ్‌స్టాల్ దగ్గర ఒక పెద్ద బోను ఉంది. ఆ బోనులో బతికి ఉన్న నాగుపాములు ఉన్నాయి. ఒక్కో నాగుపాము ధర రూ. 2 లక్షల ఇండోనేషియా రూపాయిలు అట. అంటే భారతీయ కరెన్సీలో వెయ్యి రూపాయలు. ఎవరైనా ఆర్డర్ చేసే ఆ బోనులో నుంచి పాములను తీసి స్నాక్స్ తయారు చేస్తున్నారు.


ఆ ఫుడ్‌స్టాల్ దగ్గర పాములతో పకోడీలు, బర్గర్‌లు, మోమోలు చేస్తారు. అలాగే పాములతో బార్బిక్యూ కూడా చేస్తారట. ఈ విచిత్రమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. 6.6 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``స్నేక్స్‌తో స్నాక్స్``, ``ఇకపై కోబ్రా వైరస్ వస్తుంది``, ``హర హర మహాదేవ్..`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వార్నీ.. మ్యాంగో జ్యూస్ ఇలా తయారు చేస్తారా.. ఈ వీడియో చూశాక కూడా తాగారంటే మీకు హ్యాట్సాఫ్..


Viral Video: 900 ఏళ్ల నాటి గుడిలో వెకిలి వేషాలు.. టెంపుల్ రన్ గేమ్‌ను రీ-క్రియేట్ చేస్తూ పరుగులు.. చివరకు..


Viral Video: ఈ వరుడు ధోనీ కంటే స్పీడ్‌గా ఉన్నాడు.. మరదలికి మెరుపు వేగంతో షాకిచ్చాడు.. వీడియో వైరల్


Optical Illusion: డైనోసర్ల మధ్య ఉన్న బల్బును కనిపెట్టండి.. మీ పరిశీలనా శక్తి ఏపాటిదో తెలుసుకోండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 30 , 2024 | 04:09 PM