Share News

Viral Video: ట్రైన్‌లో ఏసీ కోచ్ ఎక్కి బెర్త్ దగ్గరకు వెళ్లిన వ్యక్తికి షాక్.. రైల్వే శాఖ స్పందన ఏంటంటే..

ABN , Publish Date - Oct 23 , 2024 | 08:46 AM

సౌకర్యవంతంగా, చవకగా ఉండే రైలు ప్రయాణం చాలా మందికి ఇష్టం. జనరల్, స్లీపర్, ఏసీ.. ఇలా ఎవరి స్థోమతను బట్టి వారు రైలు ప్రయాణం చేస్తుంటారు. కాస్త డబ్బులున్న వారు ఏసీతో పాటు భద్రత ఎక్కువగా ఉంటుందనే కారణంతో ఏసీ కోచ్‌ల్లో ప్రయాణం చేస్తుంటారు.

Viral Video: ట్రైన్‌లో ఏసీ కోచ్ ఎక్కి బెర్త్ దగ్గరకు వెళ్లిన వ్యక్తికి షాక్.. రైల్వే శాఖ స్పందన ఏంటంటే..
AC coach of the train

మన దేశంలో చాలా మంది రైలు ప్రయాణం (Train Journey) చేయడానికే ఇష్టపడతారు. సౌకర్యవంతంగా, చవకగా ఉండే రైలు ప్రయాణం చాలా మందికి ఇష్టం. జనరల్, స్లీపర్, ఏసీ.. ఇలా ఎవరి స్థోమతను బట్టి వారు టికెట్లు బుక్ చేసుకుంటారు. కాస్త డబ్బులున్న వారు ఏసీతో పాటు భద్రత ఎక్కువగా ఉంటుందనే కారణంతో ఏసీ కోచ్‌ల్లో ప్రయాణం చేస్తుంటారు. అయితే ఎంత ఏసీ కోచ్ అయినా సరే జాగ్రత్తగా ఉండాల్సిందే అని ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో సూచిస్తోంది. ఏసీ కోచ్‌ (AC coach)లో టికెట్ బుక్ చేసుకున్న వ్యక్తి తన బెర్త్ దగ్గరకు వెళ్లి షాక్ తిన్నాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ప్రయాణికుడు.. ఝార్ఖండ్ నుంచి వాస్కోడిగామా మధ్య నడుస్తున్న వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ బుక్ చేసుకున్నాడు. సెకండ్ ఏసీలో తన బెర్త్ దగ్గరకు వెళ్లాడు. ఆ బెర్త్‌పై ఓ పాము (Snake) పడగ విప్పి కూర్చుని ఉంది. హఠాత్తుగా పామును చూసి షాకై గట్టిగా కేకలు వేశాడు. చుట్టు పక్కల ఉన్న ప్రయాణికులు కూడా ఆందోళనకు గురయ్యారు. వెంటనే రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందిన రైల్వే సిబ్బంది ఆ పామును పట్టుకుని బయటకు తరలించారు. రైలు ప్రయాణికులు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్‌గా మారింది.


ఈ ఘటనపై భారతీయ రైల్వే శాఖ (Indian Railway) స్పందించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని రైల్వే అధికారులు హామీ ఇచ్చారు. ప్రయాణ సమయంలో ప్రయాణికులు తమ భద్రతపై శ్రద్ధ వహించాలని, ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే రైల్వే సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. కాగా, పాముకు సంబంధించిన వీడియోను (Snake Video) ఇప్పటివరకు వేల మంది వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion: మీరు ఎంత వేగంగా ఆలోచించగలరు?.. ఈ ఫొటోలో తప్పును 4 సెకెన్లలో పట్టుకోండి..


Viral Video: పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లనని వధువు మారాం.. ఆమె సోదరుడు ఏం చేశాడో చూస్తే నవ్వాపుకోలేం..


Viral: ఈ ఆటో డ్రైవర్ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ప్యాసింజర్లకు కన్నడం ఎలా నేర్పుతున్నాడంటే..


Picture Puzzle: మీ ఐక్యూ లెవెల్‌కు టెస్ట్.. ఈ ఫొటోలో ఎన్ని పుచ్చకాయలు ఉన్నాయో చెప్పండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 23 , 2024 | 08:47 AM