Share News

Viral Video: స్టూడెంట్స్ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న టీచర్.. వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో!

ABN , Publish Date - Jun 19 , 2024 | 12:03 PM

ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య బంధం ఎంతో విలువైంది. పిల్లల ఎదుగుదలలో గురువుదే కీలకపాత్ర. పిల్లల మనసు తెలుసుకుని చక్కగా అర్థమయ్యేలా చదువు చెప్పే ఉపాధ్యాయులను ఏ పిల్లలైనా ఇష్టపడతారు. వారిని ఎంతగానో ప్రేమిస్తారు.

Viral Video: స్టూడెంట్స్ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న టీచర్.. వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో!
students surprises teacher

ఉపాధ్యాయులు (Teacher), విద్యార్థుల (Students) మధ్య బంధం ఎంతో విలువైంది. పిల్లల ఎదుగుదలలో గురువుదే కీలకపాత్ర. పిల్లల మనసు తెలుసుకుని చక్కగా అర్థమయ్యేలా చదువు చెప్పే ఉపాధ్యాయులను ఏ పిల్లలైనా ఇష్టపడతారు. వారిని ఎంతగానో ప్రేమిస్తారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో గురువు, విద్యార్థుల మధ్య ఉండాల్సిన బంధం గురించి వెల్లడించింది. ఆ వీడియో చూసిన చాలా మంది తమ స్కూల్ డేస్‌ను గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


@Gulzar_sahab అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ టీచర్ బర్త్‌డేకు స్కూలు విద్యార్థినులు సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. ఆ టీచర్ క్లాస్‌లోకి వస్తూ కెమేరా చూసి సిగ్గుపడి బయటకు వెళ్లిపోయారు. విద్యార్థులు బతిమాలిన తర్వాత లోపలికి వచ్చారు. ఓ స్టూడెంట్ ఆమెకు గిఫ్ట్ ఇచ్చారు. అది ఓపెన్ చేసి చూసి ఆ టీచర్ భావోద్వేగానికి గురయ్యారు. టీచర్‌ ఫొటోలోన్నింటినీ కలిపి ఫ్రేమ్ చేసి స్టూడెంట్స్ ఇచ్చిన గిఫ్ట్ చూసి ఆ టీచర్ కన్నీళ్లు పెట్టుకున్నారు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 6.8 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. 11 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు తమ చిన్న నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ``కల్మషం లేని ప్రేమ``, ``టీచర్, స్టూడెంట్స్ మధ్య ఉండాల్సిన నిజమైన బంధం``, ``నాకు మా చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Puzzle: మీరు ఎంతో తెలివైన వారైతే తప్ప ఈ ఫొటోలోని రెండో వ్యక్తిని కనిపెట్టలేరు.. ఒకసారి ప్రయత్నించండి..!


Viral Video: ఆమె మనిషా? రోబోనా? చైనా రెస్టారెంట్‌లో వెయిట్రెస్‌ను చూస్తే షాకవ్వాల్సిందే.. వీడియో వైరల్!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 19 , 2024 | 12:03 PM