Share News

Viral Video: షాపింగ్ చేస్తున్న అమ్మాయిలు.. లోపలికి వచ్చిన రెండు ఎద్దులు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో చూస్తే..!

ABN , Publish Date - Jul 16 , 2024 | 01:59 PM

ఆ అమ్మాయిలిద్దరూ షాపింగ్ కోసం వచ్చారు.. ఓ షాప్‌లోకి వెళ్లి బ్యాగ్‌లు చూస్తున్నారు.. అంతలో రెండు గేదెలు ఆ షాప్‌లోకి ప్రవేశించాయి.. ఆ రెండూ ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటున్నాయి.. ఆ రెండూ ఆ అమ్మాయిల వైపు దూసుకెళ్లాయి.. షాపింగ్ కోసం వచ్చిన ఆ అమ్మాయిలకు ఆ గేదెలు భయంకర అనుభవాన్ని మిగిల్చాయి.

Viral Video: షాపింగ్ చేస్తున్న అమ్మాయిలు.. లోపలికి వచ్చిన రెండు ఎద్దులు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో చూస్తే..!
Bulls fighting

ఆ అమ్మాయిలిద్దరూ (Girls) షాపింగ్ (Shopping) కోసం వచ్చారు.. ఓ షాప్‌లోకి వెళ్లి బ్యాగ్‌లు చూస్తున్నారు.. అంతలో రెండు ఎద్దులు (Bulls) ఆ షాప్‌లోకి ప్రవేశించాయి.. ఆ రెండూ ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటున్నాయి (Bulls fighting).. ఆ రెండూ ఆ అమ్మాయిల వైపు దూసుకెళ్లాయి.. షాపింగ్ కోసం వచ్చిన ఆ అమ్మాయిలకు ఆ గేదెలు భయంకర అనుభవాన్ని మిగిల్చాయి. ఆ ఘటన మొత్తం షాప్‌లో అమర్చిన సీసీటీవీలో రికార్డ్ అయింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


@Arhantt_pvt అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో రెండు గేదెలు పోట్లాడుకుంటూ ఓ షాప్‌లోకి ప్రవేశించాయి. వాటి వెనుక ఇద్దర అమ్మాయిలు చిక్కుకున్నారు. చిన్న ఇరుకు సందులో కూడా అవి పోట్లాడుకోవడంతో వాటి వెనుక చిక్కుకున్న అమ్మాయిల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. వారు తప్పించుకునే అవకాశం లేకపోయింది. చివరకు వారి కింద పడిపోయారు. వారిపై బ్యాగ్‌లు పడ్డాయి. ఆ బ్యాగ్‌లపై ఓ గేదె ఎక్కి తొక్కేసింది. అయితే పైన బ్యాగ్‌లు ఉండడంతో ఆ అమ్మాయిలు ప్రాణాలతో బయటపడ్డారు. ఒక అమ్మాయికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి.


రిషికేశ్‌ (Rishikesh)లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అదృష్టవశాత్తూ ఆ అమ్మాయి ప్రాణాలతో బయటపడింది``, ``వీడియో చాలా భయంకరంగా ఉంది``, ``ఆ అమ్మాయి అదృష్టవంతురాలు``, ``రిషికేశ్‌లో ఈ సమస్య చాలా ఎక్కువ`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Viral: డబ్బున్న వాళ్లను పట్టడం ఎలా? టిప్స్ చెబుతూ ఏకంగా రూ.162 కోట్లు సంపాదించిన లవ్ గురూ..!


Viral: వరద వస్తుందని ముందు జాగ్రత్త.. రూ.45 వేలు ఖర్చు పెట్టి మరీ ఓ వ్యక్తి ఏం చేశాడో చూడండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 16 , 2024 | 01:59 PM