Viral News: రూ.33 వేల ఖరీదైన టీ-షర్ట్ వేసుకుని చెప్పే విషయం అదా? అన్ అకాడమీ సీఈవో గౌరవ్ ముంజల్‌పై ట్రోలింగ్!
ABN , Publish Date - Aug 07 , 2024 | 06:19 PM
వివిధ పోటీ పరీక్షల కోసం ఆన్‌లైన్ కోచింగ్ అందించే సంస్థ ``అన్ అకాడెమీ`` చాలా త్వరగా ఎదిగింది. కోచింగ్ కోసం లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా అందుబాటు ధరల్లోనే శిక్షణ ఇస్తుండడంతో ఈ సంస్థకు ఆదరణ బాగా పెరిగింది.
వివిధ పోటీ పరీక్షల కోసం ఆన్‌లైన్ కోచింగ్ అందించే సంస్థ ``అన్ అకాడెమీ`` (Unacademy) చాలా త్వరగా ఎదిగింది. కోచింగ్ కోసం లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా అందుబాటు ధరల్లోనే శిక్షణ ఇస్తుండడంతో ఈ సంస్థకు ఆదరణ బాగా పెరిగింది. యూపీఎస్సీ, మెడికల్, ఇంజినీరింగ్, స్కూల్ ఎడ్యుకేషన్ వంటి పోటీ పరీక్షల కోసం ఈ సంస్థ ఆన్‌లైన్ ద్వారా శిక్షణ ఇస్తుంది. ఈ కంపెనీ వార్షిక టర్నోవర్ రూ.15 వేల కోట్లు దాటింది. అయితే గత రెండేళ్లుగా ఈ సంస్థ కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఆదాయం తగ్గుతూ వస్తోంది (Viral News).
ఈ నేపథ్యంలో అన్ అకాడెమీ సంస్థ కొంత కాలం క్రితం దాదాపు 250 మంది ఉద్యోగులను తొలగించింది. అది మర్చిపోయేలోపునే తాజాగా ఆ సంస్థ సీఈవో గౌరవ్ ముంజల్ (Gaurav Munjal) మరో షాకిచ్చారు. ఈ సంవత్సరం ఉద్యోగులు ఎవరికీ జీతంలో పెరుగుదల (No appraisal) ఉండదని తెలిపారు. వర్చువల్ టౌన్ హాల్‌లో గౌరవ్ ముంజాల్ మాట్లాడుతూ కంపెనీ వృద్ధి లక్ష్యాలను చేరుకోలేకపోయిందని అన్నారు. 2023తో పోల్చుకుంటే 2024 కాస్త బాగున్నప్పటికీ సంస్థ టార్గెట్‌లను మాత్రం రీచ్ కాలేకపోయిందని, ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఇంక్రిమెంట్లు ఉండవని అన్నారు.
గౌరవ్ ముంజల్ మీటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ మీటింగ్‌లో తన సందేశాన్ని వినిపిస్తున్నప్పుడు గౌరవ్ బ్లూబెర్రీ టీ-షర్ట్ (Blueberry t-shirt) ధరించారు. ఆ టీ-షర్ట్ ఖరీదు రూ. 33 వేల పైనే ఉంటుంది. దీంతో అతడి టీ-షర్ట్‌పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేశారు. ``సీఈవో తన లైఫ్‌స్టైల్ విషయంలో రాజీ పడడు. కానీ కష్టపడి పని చేసే ఉద్యోగులను మాత్రం పట్టించుకోడు`` అంటూ ఒకరు కామెంట్ చేశారు. చాలా ఆ టీ-షర్ట్ విషయంలో తమ స్పందనలను తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: పెళ్లిలో పురోహితుడి చేయి పట్టుకున్న వధువు.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి