Share News

Viral: ఇదెక్కడి పెళ్లి ప్రకటన నాయనా.. పేపర్‌లో వరుడు ఇచ్చిన యాడ్ చేస్తే షాకవ్వాల్సిందే.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

ABN , Publish Date - Oct 07 , 2024 | 04:32 PM

పేపర్లలో ఇచ్చే పెళ్లి ప్రకటనలలో తమ క్వాలిఫికేషన్లు, తమ సంపాదనతో పాటు కాబోయే భాగస్వామికి ఉండాల్సిన అర్హతల గురించి విస్పష్టంగా ప్రకటిస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ఇచ్చిన మ్యాట్రిమోనియల్ యాడ్ బాగా వైరల్ అవుతోంది. అది చూస్తే షాక్‌తో నోరెళ్లబెట్టాల్సిందే.

Viral: ఇదెక్కడి పెళ్లి ప్రకటన నాయనా.. పేపర్‌లో వరుడు ఇచ్చిన యాడ్ చేస్తే షాకవ్వాల్సిందే.. నెటిజన్లు ఏమంటున్నారంటే..
Unique Matrimonial Ad

గతంలో పెళ్లిళ్లు కుదర్చడానికి మధ్యవర్తులు, పెళ్లి పెద్దలు ఉండేవాళ్లు. ఇప్పుడు ఆ కాలం పోయింది. పేపర్లలో, ఆన్‌లైన్‌లో, మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో ప్రకటనలు ఇచ్చుకోవడమే. ఆ ప్రకటనలలో తమ క్వాలిఫికేషన్లు, సంపాదనతో పాటు కాబోయే భాగస్వామికి ఉండాల్సిన అర్హతల గురించి విస్పష్టంగా ప్రకటించాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ఇచ్చిన మ్యాట్రిమోనియల్ యాడ్ బాగా వైరల్ అవుతోంది. ఆ ప్రకటనలో ఆ వ్యక్తి తన ఆదాయం (Salary) గురించి రాసిన అంశాలు వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి (Unique Matrimonial Ad).


ఆ యాడ్‌లో ఆ వ్యక్తి తన రూపం, గుణం, క్యారెక్టర్, కులం గురించి సమాచారం ఇచ్చాడు. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం అతని ఆదాయానికి సంబంధించిన భాగం. స్టాక్ మార్కెట్‌ (Stock Market)లో పెట్టుబడిదారుడైన ఆ వ్యక్తి ఏడాదికి 29 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడట. అతడి సంపద ప్రతి ఏడాది 54 శాతం చొప్పున పెరుగుతోందట. అంతేకాదు తన వృత్తి, ఆదాయం స్థిరంగా ఉంటుందని పూర్తి భరోసా కూడా ఇచ్చాడు. ఎవరైనా కావాలనుకుంటే ``సురక్షిత పెట్టుబడి``కి సంబంధించి తన విధానాన్ని వివరించే 16 పేజీల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను వాట్సాప్ నెంబర్‌కు పంపిస్తాడట.


మాజీ బ్యాంకర్ సమిత్ సింగ్ ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఈ ప్రకటన వైరల్‌గా మారింది. ``బుల్ మార్కెట్ జనాలను ఏం చేస్తోందో చూడండి. 2008లో ఆర్థిక మాంద్యం వచ్చినపుడు ఆ వ్యక్తి 10 సంవత్సరాల బాలుడై ఉంటాడు. మీకెవరికైనా ఆసక్తి ఉంటే అతడిని సంప్రదించండి. పెళ్లి కోసం కాదు.. పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ కోసం`` అని సమిత్ కామెంట్ చేశారు. సమిత్ చేసిన ఈ పోస్ట్‌ను దాదాపు లక్ష మంది వీక్షించి ఫన్నీ కామెంట్లు చేశారు. ``ఇది పెద్ద స్కామ్``, ``ఇది పెళ్లి ప్రకటన కాదు.. స్టాక్ మార్కెట్ పెట్టుబడులను ప్రోత్సహించే యాడ్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion: ఈ గుహలో ఓ కుక్క దాక్కుంది.. 5 సెకెన్లలో కనిపెడితే మీ కళ్లు చాలా పవర్‌ఫుల్..

Viral Video: ఆహా.. లెక్కలు ఇలా చెబితే ఎలా మర్చిపోతాం.. పాటలు పాడుతూ మ్యాథ్స్ చెబుతున్న టీచర్.. నెటిజన్లు ఫిదా..


Viral Video: సింహం బోనులో చెయ్యి పెడితే.. ఓ మూర్ఖుడికి తగిన శాస్తి చేసిన మృగరాజు.. వీడియో చూస్తే..


Viral Video: మీ కళ్లను మీరే నమ్మలేరు.. జేబు రుమాలు పాములా ఎలా మారిందో చూడండి.. షాకింగ్ వీడియో వైరల్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 07 , 2024 | 04:32 PM