Share News

Viral News: తీరిన 15 ఏళ్ల కల.. విగ్రహంతో పెళ్లి.. కారణం ఇదే!

ABN , Publish Date - Jul 13 , 2024 | 12:57 PM

ఆ యువతి పేరు హర్షిక పంత్. ఆమె వయసు 21 సంవత్సరాలు. నడుము పక్షవాతంతో బాధపడుతున్న ఆమె బాల్యం నుంచే శ్రీకృష్ణుని భక్తురాలు. తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి..

Viral News: తీరిన 15 ఏళ్ల కల.. విగ్రహంతో పెళ్లి.. కారణం ఇదే!
Harshika Pant

తమ జీవితాలను శ్రీకృష్ణుడికే (Lord Sri Krishna) అంకితం చేసిన భక్తురాళ్ల గురించి అందరూ వినే ఉంటారు. ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా.. శ్రీకృష్ణ భగవాన్‌నే తమ భర్తలుగా భావించి.. వారి సేవ చేసుకుంటూ ఉండేవాళ్లు. ఈ కాలంలో కూడా అలాంటి వాళ్లు ఉన్నారు. భక్తి సముద్రంలో మునిగిన భక్తులు.. ఆయన్నే తమ భర్తగా అంగీకరిస్తూ ఘనంగా వివాహ వేడుకలు జరుపుకుంటున్నారు. ఇప్పుడు ఉత్తరాఖండ్‌కు (Uttarakhand) చెందిన ఓ యువతి సైతం శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకుంది. ఆమె కుటుంబ సభ్యులు ఈ వేడుకల్ని ఎంతో గ్రాండ్‌గా నిర్వహించారు. ఆ వివరాల్లోకి వెళ్తే..


ఆ యువతి పేరు హర్షిక పంత్. ఆమె వయసు 21 సంవత్సరాలు. నడుము పక్షవాతంతో బాధపడుతున్న ఆమె బాల్యం నుంచే శ్రీకృష్ణుని భక్తురాలు. తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి.. ఆయన్నే వరుడిగా పొందాలని కర్వా చౌత్ సమయంలో ఉపవాస దీక్ష చేస్తూ వస్తోంది. ఎట్టకేలకు 15 ఏళ్ల తర్వాత ఆమె కల నెరవేరింది. గురువారం (జులై 11) అంగరంగ వైభవంతో శ్రీకృష్ణుని విగ్రహంతో ఆమె వివాహం జరిగింది. ఈ పెళ్లి కోసం కృష్ణుడి విగ్రహాన్ని బృందావనం నుంచి తీసుకొచ్చారు. కుమావోని ఆచారాల ప్రకారం.. తలుపు వద్ద శ్రీకృష్ణుడికి స్వాగతం పలికారు, ఆపై పూలమాల వేసి ఏడు ప్రదక్షిణలు చేశారు. అగ్నిసాక్షిగా.. శ్రీకృష్ణుడితో ఆ యువతి వివాహం చేసుకుంది. తాను ఏడు జన్మల పాటు శ్రీ కృష్ణుడి విగ్రహంతోనే జీవిస్తానని హర్షిక ప్రమాణం చేసింది.


వివాహ కార్యక్రమం పూర్తయ్యాక.. హర్షిక శ్రీకృష్ణుడి విగ్రహాన్ని చేత పట్టుకొని, కారులో తన బంధువుల ఇంటికి వెళ్లింది. మరో విశేషం ఏమిటంటే.. ఈ పెళ్లికి బంధుమిత్రులు తరలివచ్చారు. వారి కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ వివాహానికి ముందు ఇంట్లో మెహందీ, హల్దీ కార్యక్రమాలను కూడా జరిగాయి. ఆ ఈవెంట్లకు కూడా బంధువులు, చుట్టుప్కల వాళ్లు హాజరయ్యారు. ఈ పెళ్లిపై హర్షిక తండ్రి పురాత్ చంద్రపంత్ మాట్లాడుతూ.. తన కుమార్తెకు శ్రీకృష్ణుడితో వివాహం జరిపించానని, ఇప్పుడు కృష్ణుడు తనకు అల్లుడు అయ్యాడని అన్నారు. ఇకపై శ్రీకృష్ణుడు తన ఇంట్లో ప్రత్యక్షం అవుతాడని తెలిపారు. సనాతన ఆచారాలు ప్రకారం.. తాను ఈ వివాహం జరిపించానన్నారు. కళ్యాణంలో మహాదానం, పడక దానం కూడా చేయడం గమనార్హం.

Read Latest Viral News and Telugu News

Updated Date - Jul 13 , 2024 | 12:57 PM