Share News

Love Failure: ఏందిరయ్యా మరీ ఇలా ఉన్నావ్.. బాయ్‌ఫ్రెండ్ రాక్స్.. గర్ల్‌ఫ్రెండ్ షాక్..!

ABN , Publish Date - May 30 , 2024 | 03:14 PM

CA Sends Bill to Ex Girlfriend: బ్రేకప్ అనేది.. ఏ ప్రేమికులకైనా భరించలేని బాధను కలిగిస్తుంది. కొందరు ప్రేమికులు విడిపోయిన తరువాత డిప్రెషన్‌లోకి వెళ్తుంటారు. మరికొందరు సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, రిలేషన్‌లో ఉన్నప్పుడు తమ భాగస్వామి కోసం ప్రియుడు గానీ..

Love Failure: ఏందిరయ్యా మరీ ఇలా ఉన్నావ్.. బాయ్‌ఫ్రెండ్ రాక్స్.. గర్ల్‌ఫ్రెండ్ షాక్..!
CA Sends Bill to Ex Girlfriend

CA Sends Bill to Ex Girlfriend: బ్రేకప్ అనేది.. ఏ ప్రేమికులకైనా భరించలేని బాధను కలిగిస్తుంది. కొందరు ప్రేమికులు విడిపోయిన తరువాత డిప్రెషన్‌లోకి వెళ్తుంటారు. మరికొందరు సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, రిలేషన్‌లో ఉన్నప్పుడు తమ భాగస్వామి కోసం ప్రియుడు గానీ.. ప్రియురాలు గానీ ఎన్నో బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఒకరికోసం ఒకరు ఇష్టారీతిన ఖర్చు చేస్తుంటారు. ఇద్దరి మధ్య ఖర్చులు సమానంగా ఉండకపోయినప్పటికీ, ఖర్చులు ఎవరు ఎక్కువ చేస్తున్నారనే విషయాన్ని పెద్దగా పట్టించుకోరు.

అయితే, ఆ రిలేషన్ బ్రేక్ అయినప్పుడు మాత్రం.. అన్ని విషయాలు గుర్తుకొస్తాయి. అవతలి వ్యక్తి ఎలా రెస్పాండ్ అవుతారనేది ఊహించలేని పరిస్థితి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమై నెటిజన్లను విస్మయానికి గురిచేసింది. ఈ పోస్ట్‌ ప్రకారం.. రిలేషన్‌షిప్‌లో ఉన్న సమయంలో తాను చేసిన ఖర్చులన్నీ తిరిగి ఇచ్చేయాలంటూ యువతికి బిల్లులతో కూడిన ఎక్సెల్ షీట్‌ను పంపించాడు మాజీ ప్రియుడు. సిగరేట్, కాఫీ సహా బిల్లులకు జీఎస్టీ కూడా వేసి పంపించాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఎక్స్ (ట్విట్టర్) యూజర్ @sehahaj కొన్ని ఫోటోలను షేర్ చేసి తన రూమ్‌మేట్‌కి ఎదురైన అనుభవాన్ని వివరించింది. తన రూమ్‌మేట్ గతంలో ఆదిత్య అనే CAతో డేటింగ్ చేసిందని పేర్కొంది. వారిద్దరూ ఇప్పుడు విడిపోయారు. అయితే, ఆమె కోసం ఆదిత్య చేసిన ఖర్చుల లెక్కను.. అదికూడా నెల వారీగా దేని కోసం ఎంత ఖర్చు చేశాడనే వివరాలను ఎక్సెల్ షీట్‌ తయారు చేసి పంపించాడు. క్యాష్ ఆన్ డెలివరీగా పెట్టిన గిఫ్ట్‌లకు కూడా బిల్లులు వేశాడని పేర్కొంది. ఇదే అసహ్యంగా ఉందని యువతి పేర్కొంది.

Updated Date - May 30 , 2024 | 03:14 PM