Share News

Viral: వామ్మో.. ఇలాంటి మోసాలు కూడా జరుగుతాయా!? రూ.500 నోట్ల కట్ట కవర్ విప్పితే..

ABN , Publish Date - Apr 13 , 2024 | 08:08 PM

నకిలీ నోట్లతో నిందితులు ఎలాంటి మోసాలు చేస్తున్నారో చెప్పే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: వామ్మో.. ఇలాంటి మోసాలు కూడా జరుగుతాయా!? రూ.500 నోట్ల కట్ట కవర్ విప్పితే..

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఖరీదైన వస్తువులు కొనేందుకు చాలా మంది ఇప్పటికీ నగదు రూపంలోనే డబ్బులు చెల్లిస్తారు. నోట్ల కట్టలను ఇస్తారు. ఇక భూలావాదేవీల సందర్భాల్లో కూడా భారీ ఎత్తున నోట్ల కట్టలు చేతులు మారతాయి. ఇలాంటి కొందరు కొన్ని నోట్లను మాత్రమే చెక్ చేసి ఊరుకుంటారు. అయితే, క్యాష్ రూపంలో డబ్బులు తీసుకున్నప్పుడు ఎలాంటి మోసాలు జరుగుతాయో చెప్పే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

Viral: ప్యాంటు వేసుకోకపోతే బ్యాంకులోకి రానివ్వరా? కోపంతో ఊగిపోయిన కస్టమర్! జరిగిందేంటంటే..


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ మహిళ ఎదురుగా టేబుల్‌పై రూ.500 నోట్ల కట్టలు నాలుగైదు ఉన్నాయి. మొదట ఆమె నోట్ల కట్టలను అటూఇటూ తిప్పి పరిశీలించింది. ఆ తరువాత వాటిపై ఉన్న కవర్ తొలగించగానే షాకింగ్ దృశ్యం బయటపడింది. నోట్ల కట్టలోని మొదటి, చివరి రూ.500 నోట్లు అసలైనవే అయినా వాటి మధ్య మాత్రం ఉత్త తెల్లకాగితాలను పెట్టి నిజమైన నోట్లలా నమ్మించే ప్రయత్నం జరిగింది. అసలు నోట్ల సైజులోనే తెల్లకాగితాలను కట్ చేసి వాటిని అసలు నోట్ల మధ్య జాగ్రత్తగా పెట్టి మోసపుచ్చే్ ప్రయత్నం జరిగింది. అయితే, ఈ నోట్లపై ఓ బ్యాంకుకు సంబంధించిన సీల్ కూడా ఉండటం మరింత వైరల్‌గా మారింది (Fake Currency note video).

Viral: అకస్మాత్తుగా కారు సైరెన్లు మోగడంతో పోలీసులకు షాక్.. ఏం జరిగిందని ఆరా తీస్తే..


కాగా, ఘటనపై స్పందించిన సదరు బ్యాంకు ఆ నోట్లు తమవి కావని, ఆ సీల్ అంతా నకిలీ అని తేల్చి చెప్పింది. తమ బ్యాంకులో నోట్లను ప్యాక్ చేసేందుకు వేరే రంగు పేపర్లు, సీలు వాడతామంటూ బ్యాంకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో, జనాల్లో టెన్షన్ కాస్తంత సద్దుమణిగినప్పటికీ నిందితుల టెక్నిక్ చూసి మాత్రం భయపడిపోతున్నారు. భారీ మొత్తంలో నగదు తీసుకునే సందర్భాల్లో మాత్రం ప్రతి నోట్ల కట్టను జాగ్రత్తగా పరిశీలించాలని ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 13 , 2024 | 08:12 PM