Share News

Viral Video: వామ్మో.. ఇదెక్కడి వింత జంతువు.. ఈ వీడియో చూస్తే భయంతో షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Nov 29 , 2024 | 06:36 PM

ఈ ప్రకృతికి సంబంధించిన కొత్త విషయం బయటపడినప్పుడు, అప్పటి వరకు చూడని జంతువు కనిపించినపుడు ఆశ్చర్యపోవాల్సిందే. కొన్ని వింత జంతువులను మొదటి సారి చూసినపుడు భయం, ఆశ్చర్యం ఒకేసారి కలుగుతాయి. ప్రస్తుతం అలాంటి జంతువుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: వామ్మో.. ఇదెక్కడి వింత జంతువు.. ఈ వీడియో చూస్తే భయంతో షాకవ్వాల్సిందే..
Frill Neck Lizard

ఈ ప్రపంచం గురించి, ప్రకృతి (Nature) గురించి ఎన్ని విషయాలు తెలిసినా, ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. ఈ భూమి మీద ఎన్నో వేల రకాల జీవులు నివసిస్తున్నాయి. ఈ ప్రకృతికి సంబంధించిన కొత్త విషయం (Nature Wonders) బయటపడినప్పుడు, అప్పటి వరకు చూడని జంతువు కనిపించినపుడు ఆశ్చర్యపోవాల్సిందే. కొన్ని వింత జంతువులను మొదటి సారి చూసినపుడు భయం, ఆశ్చర్యం ఒకేసారి కలుగుతాయి. ప్రస్తుతం అలాంటి జంతువుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో బల్లి (Lizard) జాతికి చెందిన ఓ జీవి కనిపిస్తోంది (Viral Video).


ఈ వీడియోను ఆస్ట్రేలియా (Australia)లోని ఓ రోడ్డుపై చిత్రీకరించారు. @AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఓ వ్యక్తి రోడ్డుపై ఉన్న బల్లిని చూసి దాని దగ్గరకు వెళ్లాడు. ఆ వ్యక్తి దగ్గరికు రాగానే ఆ బల్లి తన మెడను గొడుగులా చాచి అతడిని వెంబడించింది. నోరు తెరిచి, మెడను గొడుగులా చాచి ఉన్న ఆ జంతువును చూసి మొదట ఆ వ్యక్తి భయపడ్డాడు. ఆ తర్వాత ఆ విచిత్ర బల్లి అతడి కాలు మీద నుంచి పైకి ఎక్కి అతడి వీపుపై కూర్చుంది. ఈ బల్లిని ``ఫ్రిల్డ్ లిజార్డ్`` లేదా ``ఫ్రిల్ నెక్ లిజార్డ్`` (Frill Neck Lizard) అని పిలుస్తారు. ఇది విషపూరితం కాదు. శత్రువులను భయపెట్టడానికి ఆ బల్లులు తమ మెడలను అలా తెరిచి పరిగెడుతుంటాయి.


ఆ వీడియోలో బల్లి దూకుడు చూస్తే కొత్త వాళ్లు ఎవరికైనా గుండె ఆగినంత పని అవుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 2.3 కోట్ల మందికి పైగా వీక్షించారు. 2 లక్షల 42 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``చాలా భయంకరంగాది``, `` ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియాలోనే కనబడతాయి``, ``అవి విషపూరితం కానప్పటికీ, వాటి దంతాలు చాలా పదునుగా ఉంటాయి. అవి కొరికితే, విపరీతమైన నొప్పి ఉంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వరుడికి ఎంత అవమానం జరిగింది..? వేదిక మీదకు వస్తూ వధువు ఏం చేసిందో చూడండి..


Viral Video: వామ్మో.. ఇలా అయితే ఎలా.. వేదిక మీదే కొట్టుకున్న వధూవరులు.. వీడియో వైరల్..


Optical Illusion Test: మీ అబ్జర్వేషన్ స్కిల్స్‌కు టెస్ట్.. ఈ ఫొటోలోని భిన్నంగా ఉన్న కోడిని గుర్తించండి..


Viral Video: వధూవరులు ఎవరికి కావాలి.. అతిథుల ధాటికి వడ్డించే వాళ్ల పరిస్థితి ఏమైందో చూడండి..


Viral Video: వామ్మో.. ఈమెకు ఏమైంది.. ఏకంగా ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కినందుకు ఏం జరిగిందో తెలిస్తే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 29 , 2024 | 06:36 PM