Share News

Viral Video: అమ్మా.. ఎన్ని తెలివితేటలు తల్లి.. రీల్స్ కోసం ఆమె వాడిన టెక్నిక్ చూస్తే గిన్నీస్ బుక్ ఎక్కించాల్సిందే..!

ABN , Publish Date - Jun 26 , 2024 | 12:36 PM

బ్రెయిన్ ఉండాలే గానీ, ఎంత కష్టమైన పనినైనా సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఖరీదైన పరికరాలు లేకపోయినా అందుబాటులో ఉన్న వనరులను వాడుకుని చక్కగా మనకు కావాల్సింది చేయవచ్చు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Viral Video: అమ్మా.. ఎన్ని తెలివితేటలు తల్లి.. రీల్స్ కోసం ఆమె వాడిన టెక్నిక్ చూస్తే గిన్నీస్ బుక్ ఎక్కించాల్సిందే..!
Woman uses jugaad to capture 360 degrees video

బ్రెయిన్ (Brain) ఉండాలే గానీ, ఎంత కష్టమైన పనినైనా సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఖరీదైన పరికరాలు లేకపోయినా అందుబాటులో ఉన్న వనరులను వాడుకుని చక్కగా మనకు కావాల్సింది చేయవచ్చు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు (Jugaad videos) సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే నివ్వెరపోక తప్పదు. ఆ వీడియోలోని మహిళకు హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు. ఆ వీడియో సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది (Viral Video).


indrapankaj07 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. రీల్స్ (Reels) మేకింగ్ కోసం ఓ మహిళ అద్భుతమైన జుగాడ్ ఉపయోగించింది. తను డ్యాన్స్ చేస్తుండగా 360 డిగ్రీల (360 degree video) యాంగిల్‌లో వీడియో తీసేందుకు చక్కని ట్రిక్ వాడింది. ముందుగా ఆమె ఫ్యాన్‌ (Fan)కు ఓ కర్ర కట్టి, ఆ కర్రకు మొబైల్ జత చేసింది. ఆ తర్వాత ఫ్యాన్‌ను ఆన్ చేసింది. చాలా నెమ్మదిగా ఆ ఫ్యాన్ తిరుగుతుండగా మొబైల్ కూడా ఆమె చుట్టూ తిరుగుతూ వీడియో తీస్తోంది. ఆమె చక్కగా డ్యాన్స్ చేస్తుండగా 360 డిగ్రీల్లో వీడియోను క్యాప్చర్ చేస్తోంది.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 3.5 కోట్ల మంది ఈ వీడియోను వీక్షించారు. 6.7 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ``ఇది అద్భుతమైన ఆలోచన``, ``ఈమెకు గిన్నీస్ బుక్ అవార్డు ఇవ్వాలి``, ``ఈ ఆలోచన చేసిన వారికి హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ``

ఇవి కూడా చదవండి..

Puzzle: మీ కళ్లు నిజంగా షార్ప్‌గా పని చేస్తున్నాయా? అయితే ఈ ఫొటోలోని చెర్రీ ఎక్కడుందో 8 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral Video: ఈ చిన్న ట్రిక్‌తో ఎలా మోసం చేస్తున్నారో చూడండి.. కళ్లకు కట్టినట్టు చూపించిన వ్యాపారి!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 26 , 2024 | 01:02 PM