Share News

Viral News: వామ్మో ఈ మేక ధర తెలిస్తే షాక్ అవుతారు..ఈ రేటుతో ఓ ఇల్లు కొనుక్కోవచ్చు

ABN , Publish Date - Jun 17 , 2024 | 08:01 AM

బక్రీద్ పండుగ వస్తే చాలు మేకలకు(goats) ఫుల్ డిమాండ్ ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో బలి కోసం ఉపయోగించే మేకలకు ధరలు వేలల్లో ఉంటాయి. అంతేకాదు మరికొన్ని చోట్ల ఒక్కో మేక ధర లక్షల రూపాయలు పలుకుతుంది. కానీ ఇప్పటివరకు ఓ మేక ధర మాత్రం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Viral News: వామ్మో ఈ మేక ధర తెలిస్తే షాక్ అవుతారు..ఈ రేటుతో ఓ ఇల్లు కొనుక్కోవచ్చు
most expensive goat in the world

బక్రీద్ పండుగ వస్తే చాలు మేకలకు(goats) ఫుల్ డిమాండ్ ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో బలి కోసం ఉపయోగించే మేకలకు ధరలు వేలల్లో ఉంటాయి. అంతేకాదు మరికొన్ని చోట్ల ఒక్కో మేక ధర లక్షల రూపాయలు పలుకుతుంది. కానీ ఇప్పటివరకు ఓ మేక ధర మాత్రం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. అంతేకాదు ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మేకగా రికార్డు సృష్టించింది. ఆ మేక వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్(Guinness Book of World Records) ప్రకారం బ్రాడ్ అనే ఈ మేక ధర 82,600 అమెరికన్ డాలర్లు. అంగోరా జాతికి చెందిన ఈ మేక ధర బ్రిటన్‌లో అత్యధికంగా పలకడం విశేషం. ఇది భారతీయ రూపాయలలో చూస్తే దాదాపు రూ.69 లక్షలు. అయితే అసలు షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ ధర ప్రస్తుతం చెల్లించిన రేటు కాదు. 1985లో పలికిన రేటు. అప్పట్లోనే ఈ మేక ధర దాదాపు రూ. 69 లక్షల ఉంటే ఈరోజు ధరల ప్రకారం చూస్తే మాత్రం కోట్లలో ఉంటుందని చెప్పవచ్చు. ఇది తెలిసిన పలువురు ఈ రేటుతో ఇండియాలో ఎంచక్కా ట్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్ కొనుగోలు చేయవచ్చని అంటున్నారు.


తెల్లటి జుట్టు గల అంగోరా మేకలు ప్రపంచంలోని ఉత్తమ మేక(angora goat) జాతులని చెబుతారు. ఈ మేకలను ప్రధానంగా ఉన్ని కోసం పెంచుతారు. అయితే బక్రీద్ సందర్భంగా చాలా మంది వీటిని కూడా త్యాగం చేస్తారు. వాటి నుంచి బయటకు వచ్చే ఉన్నిని మోహైర్ అని పిలుస్తారు. 1960లో టర్కీలో 6 మిలియన్లకు పైగా అంగోరా మేకలు ఉండేవి. క్రమంగా వీటి సంఖ్య తగ్గడంతో వీటికి భారీగా డిమాండ్ ఏర్పడింది.


ఇది కూడా చదవండి:

EVMs: ఈవీఎం వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్‌కి కేంద్ర మాజీ మంత్రి కౌంటర్


Viral video: వామ్మో..! తల్లిని మించిపోయిన దూడ.. ఏనుగుకు ఎదురుగా వెళ్లి మరీ..


Rahul Gandhi: ఈవీఎంలపై అనుమానాలు.. ఎన్నికల ప్రక్రియలో లోపాలపై ప్రశ్నలు సంధించిన రాహుల్..



Read Latest Viral News and Telugu News

Updated Date - Jun 17 , 2024 | 08:07 AM