Share News

Viral Video: ధైర్యవంతులైతేనే ఈ వీడియో చూడండి.. ట్రాక్టర్ చక్రం లేపుదామనుకున్నాడు.. కాళ్లు పోగొట్టుకున్నాడు..

ABN , Publish Date - Sep 17 , 2024 | 09:53 AM

సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా యువత ప్రమాదకర సాహసాలకు దిగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటోంది. సాహసాలకు ఒడిగడుతూ వ్యూస్, లైక్స్ పరమావధిగా చాలా మంది మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు.

Viral Video: ధైర్యవంతులైతేనే ఈ వీడియో చూడండి.. ట్రాక్టర్ చక్రం లేపుదామనుకున్నాడు.. కాళ్లు పోగొట్టుకున్నాడు..
Young man tries to lift tractor wheel

సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా యువత ప్రమాదకర సాహసాలకు దిగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటోంది. ఇప్పటికే ఎంతో మంది ఇలా తీవ్ర గాయాల బారిన పడ్డారు. అయినా లెక్క చేయకుండా సాహసాలకు ఒడిగడుతూ వ్యూస్, లైక్స్ పరమావధిగా చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు రీల్స్ (Reels) కోసం వీడియో చేయబోయి రెండు కాళ్లు విరగొట్టుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


deathp0sitive అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం ఓ యువకుడు ట్రాక్టర్‌కు ఉండే భారీ చక్రాన్ని (Tractor Wheel) తన రెండు కాళ్లతో (Legs) పైకి లేపడానికి ప్రయత్నించాడు. కింద సీట్లో జారబడి కూర్చుని రెండు కాళ్లను ట్రాక్టర్ చక్రంపై పెట్టి దానిని పైకి లేపాడు. అయితే అంత బరువును ఆ కాళ్లు మోయలేకపోయాయి. రెండు కాళ్లు పుల్ల ముక్కల్లా విరిగిపోయాయి. కళ్ల ముందే అంత భారీ ప్రమాదం జరగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియో ఒక్క రోజులో సుమారు 2 కోట్ల వ్యూస్ ని సొంతం చేసుకుంది. 3.75 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇంత కంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు``, ``ఎవరూ ఇటువంటి విన్యాసాలు చేయవద్దు`` , ``నీ జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు?``, ``ఎంత బాధాకరం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion: మీ దృష్టి ఎంత షార్ప్‌గా ఉంది?.. ఈ ఫొటోలో భిన్నంగా ఉన్న గొడుగును కనిపెట్టండి..


Viral Video: వార్నీ.. ఈ బుడతడు భలే ధైర్యవంతుడు.. బల్లిని పట్టుకుని ఎలా ఆడుతున్నాడో చూడండి..


Viral: ఏడాదికి రూ.30 లక్షల జీతం ఉండాలి.. పేరెంట్స్ ఉండకూడదు.. ఓ వధువు పెట్టిన కండిషన్లు వింటే కళ్లు తేలెయ్యాల్సిందే..


Picture Puzzle: మీ బ్రెయిన్‌కు అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో తప్పు ఎక్కడుందో కనుక్కోండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 17 , 2024 | 09:53 AM