Share News

AUS Vs PAK: మూడో టెస్టుకు ముందు డేవిడ్ వార్నర్‌కు షాక్.. బ్యాగ్ మాయం

ABN , Publish Date - Jan 02 , 2024 | 06:23 PM

AUS Vs PAK: బుధవారం నుంచి సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య మూడో టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు మెల్‌బోర్న్ నుంచి సిడ్నీకి పయనం అయ్యింది. ఈ క్రమంలో స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ బ్యాగ్ మిస్ కావడం చర్చనీయాంశంగా మారింది.

AUS Vs PAK: మూడో టెస్టుకు ముందు డేవిడ్ వార్నర్‌కు షాక్.. బ్యాగ్ మాయం

బుధవారం నుంచి సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య మూడో టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు మెల్‌బోర్న్ నుంచి సిడ్నీకి పయనం అయ్యింది. ఈ క్రమంలో స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ బ్యాగ్ మిస్ కావడం చర్చనీయాంశంగా మారింది. తాను పోగొట్టుకున్న బ్యాగ్‌లో తన పిల్లల వస్తువులు ఉన్నాయని.. తన బ్యాగీ గ్రీన్ క్యాప్ కూడా ఉందని.. ఆ క్యాప్ తనకు ఎంతో స్పెషల్ అని డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గ్రీన్ క్యాప్ తనకు సెంటిమెంట్ అని.. ఆ క్యాప్ ధరించి కెరీర్‌లో చివరి టెస్టు ఆడాలని భావించానని.. ఎవరైనా తన బ్యాక్ ప్యాక్‌ను తీసుకుంటే అది తిరిగి ఇచ్చేయాలని.. వాళ్లకు వేరే బ్యాక్ ప్యాక్ ఇస్తానని, ఎలాంటి ఇబ్బందులు పెట్టనని వార్నర్ వెల్లడించాడు.

ఈ బ్యాగ్ గురించి తాను బస చేసిన హోటల్‌లో సీసీ టీవీ ఫుటేజ్ కూడా పరిశీలించానని.. కానీ బ్యాగ్ జాడ ఎక్కడా కూడా దొరకలేదని వార్నర్ అన్నాడు. తన బ్యాగ్ తీసినవాళ్లు తన క్యాప్ తిరిగి ఇస్తే తాను ఎంతో సంతోషిస్తానని వార్నర్ తన పోస్టులో పేర్కొన్నాడు. కాగా ఈనెల 3 నుంచి సిడ్నీ వేదికగా పాకిస్థాన్‌తో జరిగే టెస్టు తన కెరీర్‌లో చివరి మ్యాచ్ అని వార్నర్ గతంలోనే ప్రకటించాడు. అంతేకాకుండా ఇప్పటికే వన్డేలకు కూడా గుడ్‌బై చెప్పేశానని.. గత ఏడాది అహ్మదాబాద్ వేదికగా టీమిండియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ తనకు చివరి మ్యాచ్ అని వార్నర్ సోమవారం ప్రకటించడంతో క్రికెట్ అభిమానులు షాక్‌కు గురయ్యారు. అవసరమైతే తాను 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటానని వార్నర్ చెప్పడం అభిమానుల్లో సంతోషం నింపింది.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 02 , 2024 | 06:23 PM