Share News

KL Rahul: కేఎల్ రాహుల్‌పై లక్నో ఓనర్ మండిపాటు.. నెటిజన్ల కౌంటర్ ఎటాక్

ABN , Publish Date - May 09 , 2024 | 03:43 PM

సాధారణంగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఏదైనా ఓ జట్టు ఓటమిపాలైతే, ఆ రిజల్ట్‌పై సదరు జట్టు యజమాని టీమ్ సభ్యులు, కోచ్‌లు, కెప్టెన్‌లతో చర్చలు జరుపుతాడు. ఎక్కడ తప్పులు జరిగాయి? ఓటమికి గల కారణాలేంటి?

KL Rahul: కేఎల్ రాహుల్‌పై లక్నో ఓనర్ మండిపాటు.. నెటిజన్ల కౌంటర్ ఎటాక్

సాధారణంగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో (Indian Premiere League) భాగంగా ఏదైనా ఓ జట్టు ఓటమిపాలైతే, ఆ రిజల్ట్‌పై సదరు జట్టు యజమాని టీమ్ సభ్యులు, కోచ్‌లు, కెప్టెన్‌లతో చర్చలు జరుపుతాడు. ఎక్కడ తప్పులు జరిగాయి? ఓటమికి గల కారణాలేంటి? తదుపరి మ్యాచ్‌ల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అనే అంశాలపై నాలుగు గోడల మధ్య సుదీర్ఘంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. అంతే తప్ప.. బహిరంగ ప్రదేశాల్లో జట్టు యజమాని కోపం ప్రదర్శించిన సందర్బాలైతే లేవు.

చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్.. టీ20 క్రికెట్‌లో ఆల్‌టైం రికార్డ్

కానీ.. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) యజమాని సంజీవ్ గోయెంకా (Sanjiv Goenka) బహిరంగంగా కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై (KL Rahul) కోపంతో ఊగిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 10 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో తన లక్నో జట్టు అవమానకరమైన ఓటమిని చవిచూడటంతో తట్టుకోలేకపోయిన సంజీవ్.. బౌండరీ లైన్ వద్దే రాహుల్‌ని నిలబెట్టి, అతనిపై కోపం ప్రదర్శించాడు. ‘‘అత్యంత కీలకమైన మ్యాచ్‌లో ఇంత పేలవ ప్రదర్శన ఏంటి? ఈ రెండు పాయింట్లు మనకెంతో ముఖ్యమో నీకు తెలుసు కదా? కెప్టెన్‌గా సరైన ప్రణాళికలు ఎందుకు రచించలేకపోయావు?’’ అన్నట్లుగా రాహుల్‌కు క్లాస్ పీకాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


LSGపై SRH గ్రాండ్ విక్టరీ.. రెండు జట్లకు గట్టి షాక్

దీంతో.. సంజీవ్ గోయెంకా తీరుపై క్రీడాభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఏ జట్టు ఓనర్ కూడా తన కెప్టెన్ పట్ల ఇలా ప్రవర్తించలేదని, అసలు కెప్టెన్ పట్ల ఇంత దారుణంగా ఎవరైనా వ్యవహరిస్తారా? అని పెద్దఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా మాట్లాడాలనుకుంటే.. అది నాలుగు గోడల మధ్య చర్చించుకుంటే బెటరని.. కానీ ఇలా బహిరంగంగా కోపం ప్రదర్శించడంత ఏమాత్రం సమంజసం కాదంటూ తూర్పారపడుతున్నారు. సంజీవ్ చేసింది ముమ్మాటికీ పెద్ద తప్పంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ ఒక్క కప్పు కొట్టకపోయినా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) యాజమాన్యం తన జట్టు సభ్యులతో ఇలా ప్రవర్తించలేదని గుర్తు చేస్తున్నారు.

సంజు శాంసన్‌కు ఫైన్.. ఎందుకంటే..?

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో విధించిన ఈ నామమాత్రపు లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు ఉఫ్‌మని ఊదేసింది. కేవలం 9.4 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేధించి.. టీ20 క్రికెట్ చరిత్రలో 150కి పరుగుల లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేధించిన జట్టుగా రికార్డులకెక్కింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (89), అభిషేక్ శర్మ (75) ఊచకోత కోయడం వల్లే.. హైదరాబాద్ జట్టు ఈ సంచలన విజయాన్ని నమోదు చేయగలిగింది.

Read Latest Sports News and Telugu News

Updated Date - May 09 , 2024 | 04:36 PM