Share News

MS Dhoni: సీఎస్కేకు ధోనీ గుడ్‌బై.. ఆ నలుగురి కోసమే త్యాగం?

ABN , Publish Date - Jul 29 , 2024 | 03:13 PM

గత కొన్నాళ్లుగా మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ జోరుగా ప్రచారాలు జరగ్గా.. వాటికి చెక్ పెడుతూ చెన్నై సూపర్ కింగ్స్‌లో అతను కొనసాగుతూ...

MS Dhoni: సీఎస్కేకు ధోనీ గుడ్‌బై.. ఆ నలుగురి కోసమే త్యాగం?
MS Dhoni

గత కొన్నాళ్లుగా మహేంద్ర సింగ్ ధోనీకి (MS Dhoni) ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ జోరుగా ప్రచారాలు జరగ్గా.. వాటికి చెక్ పెడుతూ చెన్నై సూపర్ కింగ్స్‌లో (Chennai Super Kings) అతను కొనసాగుతూ వచ్చాడు. ఆ ఫ్రాంచైజీకి తన సేవలు అందిస్తూనే ఉన్నాడు. అయితే.. తదుపరి సీజన్‌లో మాత్రం అతను సీఎస్కే తరఫున ఆడటం దాదాపు కష్టమేనన్న వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ పెట్టిన ఒక షరతు కారణంగా.. ఐపీఎల్ 2024 సీజనే అతనికి చివరిది కావొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆ షరతులో మార్పులేమైనా చేస్తే.. అప్పుడు ధోనీ ఆడే అవకాశాలు ఉన్నాయని సమాచారం.


ఇంతకీ ఆ షరతు ఏంటి?

బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ అయినా కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటెన్షన్ రిటెన్షన్ చేసుకోవడానికి వీలుంటుంది. క్రీడా వర్గాల రిపోర్ట్స్ ప్రకారం.. ఈ ఏడాది చివర్లో జరగనున్న IPL 2025 మెగా వేలానికి ముందు సీఎస్కే ఫ్రాంచైజీ రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మతీషా పతిరానా, శివమ్ దూబేలను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే.. ఆ నలుగురితో పాటు తమ లెజెండ్ ధోనీని కూడా రిటైన్ చేసుకోవాలని సీఎస్కే భావిస్తోంది. అందుకే.. రిటెన్షన్ నియమాలపై బీసీసీఐతో చర్చించేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 31వ తేదీన బీసీసీఐతో కలిసి.. రిటెన్షన్ పాలసీలో మార్పులు చేసి, ఆటగాళ్లను రిటైన్ చేసుకునే సంఖ్యను 5 లేదా 6కి పెంచాలని కోరనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ బీసీసీఐ అందుకు అంగీకరిస్తే.. అప్పుడు సీఎస్కేలో ధోనీ కొనసాగొచ్చు.


ఆటగాడిగా రాకపోతే..

ఒకవేళ బీసీసీఐ రిటెన్షన్ నియమాల్లో మార్పులు చేయడానికి ఒప్పుకోకపోతే.. అప్పుడు ధోనీ చెన్నై మెంటార్‌గా కనిపించే ఛాన్స్ ఉందని క్రిక్‌బస్ అంచనా వేసింది. ఇప్పటికే తను జట్టులో కొనసాగాలా? వద్దా? అనే విషయంపై చెన్నై ఫ్రాంచైజీ యజమాని ఎన్.శ్రీనివాసన్‌తో (N Srinivasan) ధోనీ చర్చించినట్లు తెలుస్తోంది. రిటెన్షన్ పాలసీ దృష్ట్యా జట్టులో చోటు దక్కకపోతే.. అప్పుడు ధోనీని మెంటార్‌గానో, కోచ్‌గానో రంగంలోకి దింపాలని సీఎస్కే యాజమాన్యం భావిస్తోంది. ఈరోజు సీఎస్కే ఈ స్థానంలో ఉందంటే.. దానికి ధోనీనే ప్రధాన కారణం కాబట్టి, ఎలాగైనా జట్టుతోనే ఉండేలా చెన్నై యాజమాన్యం ఇలా మరో మార్గాన్ని అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. మరి.. ఏది సాధ్యమవుతుందో వేచి చూడాల్సి ఉంటుంది.


ఐదుసార్లు ఛాంపియన్‌గా..

ఇదిలావుండగా.. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ధోనీ చెన్నై ఫ్రాంచైజీతోనే ఉన్నాడు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అతను జట్టును ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపాడు. ప్రతి అంశంలోనూ తన మార్క్ చూపిస్తూ.. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిపాడు. ఐపీఎల్-2024లో కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించినా.. తనదైన సలహాలు ఇస్తూ జట్టుని నడిపించాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 29 , 2024 | 03:22 PM