IPL 2024: ఐపీఎల్‌లో అరుదైన మైలురాయి చేరుకున్న దినేశ్ కార్తీక్
ABN , Publish Date - Apr 21 , 2024 | 04:27 PM
కోల్‌కతా: ఐపీఎల్ 2024లో (IPL 2024) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు దారుణంగా విఫలమవుతోంది. ఆ జట్టులో ఇద్దరే ఇద్దరు ఆటగాళ్లు రాణిస్తుండగా అందులో ఒకరు దినేశ్ కార్తీక్ (Dinesh Karthik). జట్టు ఎంత ఘోరంగా విఫలమవుతున్నా డీకే మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ ప్రదర్శన చేస్తున్నాడు. మరోపక్క వికెట్ కీపర్‌గానూ రాణిస్తున్నాడు.
కోల్‌కతా: ఐపీఎల్ 2024లో (IPL 2024) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు దారుణంగా విఫలమవుతోంది. ఆ జట్టులో ఇద్దరే ఇద్దరు ఆటగాళ్లు రాణిస్తుండగా అందులో ఒకరు దినేశ్ కార్తీక్ (Dinesh Karthik). జట్టు ఎంత ఘోరంగా విఫలమవుతున్నా డీకే మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ ప్రదర్శన చేస్తున్నాడు. మరోపక్క వికెట్ కీపర్‌గానూ రాణిస్తున్నాడు. అతడి ఫామ్ దృష్ట్యా టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటివ్వాలనే చర్చ కూడా నడుస్తోంది. కాగా ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌పై మ్యాచ్ ఆడడం ద్వారా ఐపీఎల్‌లో అరుదైన మైలురాయిని దినేశ్ కార్తీక్ చేరుకున్నాడు.
ఐపీఎల్ చరిత్రలో 250 మ్యాచ్‌లు ఆడిన మూడో ఆటగాడిగా కార్తీక్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. తనకన్నా ముందు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ మాత్రమే ఈ మైలురాయిని సాధించారు. ధోనీ, రోహిత్ ఇద్దరూ ఐపీఎల్‌లో 250కి పైగా మ్యాచ్‌లు ఆడారు. కార్తీక్ ఐపీఎల్ కెరియర్ విషయానికి వస్తే మొత్తం ఆరు ఫ్రాంచైజీ జట్లకు ఆడాడు. తొలిసారి 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఐపీఎల్ కెరీర్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత కింగ్స్11 పంజాబ్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల తరపున ఆడాడు.
ఇవి కూడా చదవండి
Dinesh Karthik: టీ20 వరల్డ్‌కప్‌లో చోటు.. 100% సిద్ధమన్న దినేశ్ కార్తిక్
IPL 2024: 65 సిక్స్‌లు, 53 ఫోర్లు.. చివరి ఓవర్‌లో ధోనీ విధ్వంసం
మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం క్లిక్ చేయండి