Virat Kohli: విరాట్ కోహ్లీపై ‘స్ట్రైక్ రేట్’పై విమర్శలు.. గౌతమ్ గంభీర్ చురకలు
ABN , Publish Date - Apr 28 , 2024 | 07:39 PM
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్-2024 సీజన్‌లో కోహ్లీ కేవలం తన వ్యక్తిగత లక్ష్యాల కోసమే ఆడుతున్నాడని, జట్టు ప్రయోజనాల కోసం...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) స్ట్రైక్ రేట్‌పై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్-2024 (IPL 2024) సీజన్‌లో కోహ్లీ కేవలం తన వ్యక్తిగత లక్ష్యాల కోసమే ఆడుతున్నాడని, జట్టు ప్రయోజనాల కోసం ఆడట్లేదని కామెంట్లు వస్తున్నాయి. ఓవైపు యువ ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడుతుంటే, కోహ్లీ మాత్రం నిదానంగా రాణిస్తున్నాడని విమర్శిస్తున్నారు. ఇందుకు టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. స్ట్రైక్ రేట్ ముఖ్యం కాదని, గెలుపే ముఖ్యమని సమాధానం ఇచ్చాడు.
రిషభ్ పంత్‌కి భారీ ఎదురుదెబ్బ.. ఒక మ్యాచ్ నిషేధం.. ఎందుకంటే?
గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఆటగాడికి తనకంటూ ఒక భిన్నమైన శైలి ఉంటుంది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ చేసేది.. కోహ్లీకి సాధ్యం కాదు. అలాగే.. కోహ్లీ ఆడినట్లు మ్యాక్స్‌వెల్ ఆడకపోవచ్చు. ప్రతి జట్టులోనూ విభిన్నమైన బ్యాటర్లు ఉండాల్సిందే. మొదటి స్థానం నుంచి 8వ స్థానం వరకూ.. కేవలం హిట్టర్లు మాత్రమే ఉంటే అప్పుడు స్కోరు 300 కొట్టొచ్చు. లేకపోతే 30 పరుగులకే ఆలౌట్ అవ్వొచ్చు. 100 స్ట్రైక్ రేటుతో ఆడినా, ఓ జట్టు గెలిచే పరిస్థితి ఉంటే మంచిదే. కానీ.. 180 స్ట్రైక్‌రేట్‌తో ఆడిపోయి కూడా ఓడిపోతే, మరి ప్రయోజనం ఏముంది’’ అని గంభీర్ విశ్లేషించాడు. అంటే.. కోహ్లీ ఆడుతున్న తీరు సరైనదేనని అతను మద్దతుగా నిలిచి, విమర్శకుల నోళ్లు మూయించేశాడు.
రియల్‌గా మారిన రీల్ లైఫ్.. రోబోతో పెళ్లికి సిద్ధమైన భారత ఇంజనీర్
ఇదే సమయంలో తమ మధ్య ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ.. టీఆర్పీల కోసం మీడియానే తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేసిందని, సంచలనాల కోసమే తమ ఇద్దరి మధ్య ఏదో జరిగినట్లు చూపించిందని కుండబద్దలు కొట్టాడు. తాను ఎలాంటి వ్యక్తినో, విరాట్ వ్యక్తిత్వం ఏమిట మీడియాకు కనీస అవగాహన లేదని చురకలంటించాడు. మీడియా అనవసరంగా హైప్ సృష్టించిందని మండిపడ్డాడు. జనాలకు మసాలా దొరక్కపోతే ఇలా చేస్తారని విరాట్ చెప్పిన మాటతో తాను ఏకీభవిస్తానని తెలిపాడు. ఇక తనకు విరాట్‌లో డ్యాన్స్ చేయలేనన్న గంభీర్.. నేను అతడి నుంచి ఏదైనా నేర్చుకోవాలనుకుంటే అది డ్యాన్స్ మాత్రమేనని సరదాగా చెప్పుకొచ్చాడు.
Read Latest Sports News and Telugu News