Share News

AFG vs BAN: ఇది ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్.. మ్యాచ్ మధ్యలో ఏం చేశాడంటే?

ABN , Publish Date - Jun 25 , 2024 | 03:49 PM

అప్పుడప్పుడు ఆటగాళ్లు మైదానంలో విచిత్రమైన చర్యలకు పాల్పడుతుంటారు. జట్టు కోసమో లేదా తమ భావాలకు వ్యక్తీకరించడం కోసం.. వింతవింతగా వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్..

AFG vs BAN: ఇది ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్.. మ్యాచ్ మధ్యలో ఏం చేశాడంటే?
Gulbadin Naib Oscar Worthy Acting

అప్పుడప్పుడు ఆటగాళ్లు మైదానంలో విచిత్రమైన చర్యలకు పాల్పడుతుంటారు. జట్టు కోసమో లేదా తమ భావాలకు వ్యక్తీకరించడం కోసం.. వింతవింతగా వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్ గుల్బదిన్ నయీబ్ (Gulbadin Naib) కూడా అలాంటి పనే చేసి.. టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోచ్ ఆదేశాల మేరకు అతను చేసిన పని చూసి.. ‘బాబోయ్ ఇదేం ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నా.. చాలామంది మాత్రం అతని చర్యను కామెడీగా తీసుకున్నారు. అసలేం జరిగిందంటే..


టీ20 వరల్డ్‌కప్‌లోని (T20 World Cup) సూపర్-8లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ (AFG vs BAN) మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో ఆఫ్ఘన్ గెలిచి సెమీ ఫైనల్స్‌కు చేరింది కానీ.. మ్యాచ్ మధ్యలో నయీబ్ ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్ కనబరిచాడు. బంగ్లా జట్టు 81/7 స్కోరు వద్ద డీఎల్ఎస్ స్కోరులో 2 పరుగులు వెనుకబడి ఉన్నప్పుడు.. వర్షపు జల్లులు కురవడం మొదలైంది. ఇది గమనించిన ఆఫ్ఘన్ కోచ్ జొనాథ్ ట్రాక్.. ఆటను నెమ్మదించమంటూ ఆటగాళ్లకు సందేశం పంపించాడు. అతని సంజ్ఞలను అర్థం చేసుకున్న గుల్బదిన్.. తనకు కండరాల నొప్పి ప్రారంభమైనట్టుగా నటిస్తూ ఒక్కసారిగా నేల మీద పడిపోయాడు. ఎలాగో వర్షం స్టార్ట్ అయ్యింది కాబట్టి.. కాసేపు మ్యాచ్‌కు విరామం ప్రకటించి, కవర్స్‌ని మైదానంలోకి తీసుకొచ్చేశారు. మరోవైపు.. సిబ్బంది సహకారంతో నయీబ్ మైదానం వదిలి వెళ్లాడు.


కోచ్ ఆదేశాల మేరకు నయీబ్ ఇలా ప్రవర్తించాడని వీడియోలో రికార్డ్ అవ్వడం చూసి.. కామెంటర్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇలా చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సైమన్ డౌల్ అసంతృప్తి వెళ్లగక్కాడు. పోమ్మీ ఎంబెంగ్వా కూడా మాట్లాడుతూ.. అతని నటనకు ఆస్కార్ లేదా ఎమ్మీ అవార్డ్స్ ఇవ్వాల్సిందే అన్నట్టు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సంగతులు పక్కనపెడితే.. నయీబ్ ఆ కాసేపటికే తిరిగి మైదానంలో అడుగుపెట్టి, వెంటనే వికెట్ తీశాడు. అంతేకాదు.. ఆఫ్ఘన్ జట్టు గెలిచాక రన్నింగ్ రేసు తరహాలో జోరుగా పరుగులు తీశాడు. దీంతో.. సోషల్ మీడియాలో అతని యాక్టింగ్‌పై మీమ్స్ పుట్టుకొస్తున్నాయి. ఇది మామూలు యాక్టింగ్ కాదంటూ కామెంట్లు వస్తున్నాయి.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 25 , 2024 | 03:49 PM