Share News

India vs Zimbabwe: రాణించిన సంజూ శాంసన్.. జింబాబ్వే ముందు మోస్తరు లక్ష్యం

ABN , Publish Date - Jul 14 , 2024 | 06:26 PM

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. జింబాబ్వేతో జరుగుతున్న ఐదో మ్యాచ్‌లో భారత జట్టు మోస్తరు స్కోరుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులే చేసింది. సంజూ శాంసన్..

India vs Zimbabwe: రాణించిన సంజూ శాంసన్.. జింబాబ్వే ముందు మోస్తరు లక్ష్యం
India vs Zimbabwe

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. జింబాబ్వేతో జరుగుతున్న ఐదో మ్యాచ్‌లో భారత జట్టు మోస్తరు స్కోరుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులే చేసింది. సంజూ శాంసన్ (58) ఒక్కడే అర్థశతకంతో జట్టుని ఆదుకున్నాడు. చివర్లో శివమ్ దూబే (26) కాస్త మెరుపులు మెరిపించాడు. రియాన్ పరాగ్ 22 పరుగులు చేశాడు కానీ.. స్లో ఇన్నింగ్స్‌తో నిరాశపరిచాడు. మిగతా బ్యాటర్లలో ఏ ఒక్కరూ 15 పరుగుల మార్క్‌ని టచ్ చేయలేకపోయారు. దీంతో.. భారత్ స్కోరు 167/6గా నమోదైంది. ఇది పెద్ద స్కోరు కాదు కాబట్టి.. మ్యాచ్ గెలుపొందాలంటే.. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయాల్సి ఉంటుంది.


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. విధ్వంసకర ఓపెనర్ యశస్వీ జైస్వాల్ మొదటి ఓవర్‌లోనే నాలుగో బంతికి ఔట్ అయ్యాడు. క్రీజులో అడుగుపెట్టడంతోనే అతడు రెండు సిక్సులు బాదాడు కానీ, అదే దూకుడులో అతడు ఔట్ అయ్యాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ, కెప్టెన్ శుభ్‌మన్ కూడా వెనువెంటనే పెవిలియన్ బాట పట్టారు. వీళ్లు ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. అప్పుడు సంజూ శాంసన్, రియాన్ పరాగ్ కలిసి జట్టుని ఆదుకున్నారు. పరాగ్ భారీ ఇన్నింగ్స్ ఆడలేదు కానీ.. సంజూకి సహకారం అందించాడు. మరోవైపు.. సంజూ ఆచితూచి ఆడుతూనే, వీలు దొరికినప్పుడల్లా భారీ షాట్లతో శివాలెత్తాడు. ఈ క్రమంలోనే అతడు హాఫ్ సెంచరీ చేశాడు.


అయితే.. ఇంతలోనే పరాగ్, సంజూ తమ వికెట్లు కోల్పోయారు. క్రీజులో సెటిల్ అయ్యారు, ఇక వీరబాదుడు బాదుతారని అనుకునేలోపే ఒకరి తర్వాత మరొకరు ఔట్ అయ్యారు. దీంతో స్కోరు నెమ్మదించింది. అప్పుడు నేనున్నానంటూ బరిలోకి దిగిన శివమ్ దూబే.. రెండు సిక్సులు, రెండు ఫోర్లు కొట్టి ఊపిరి పోశాడు. రింకూ సింగ్ నుంచి ఈసారి ఎలాంటి మెరుపుల్లేవు. 9 బంతుల్లో ఒక సిక్స్ కొట్టి 11 పరుగులే చేశాడు. ఇక జింబాబ్వే బౌలర్ల విషయానికొస్తే.. ముజరబాని తన నాలుగు ఓవర్ల కోటాలో 19 పరుగులిచ్చి, రెండు వికెట్లు తీశాడు. ఇక సికందర్, రిచర్డ్, బ్రాండన్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

Updated Date - Jul 14 , 2024 | 06:26 PM