Share News

Rohit Sharma: మ్యాగీ మ్యాన్ అంటూ రోహిత్ శర్మపై ట్రోల్స్.. కౌంటర్ ఎలా ఇచ్చాడంటే?

ABN , Publish Date - Jun 19 , 2024 | 03:21 PM

ఇప్పుడంటే రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా, ప్లేయర్‌గా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నాడు కానీ.. కెరీర్ ప్రారంభంలో అతను బాడీ షేమింగ్‌కి గురయ్యాడు. అతను బరువుగా..

Rohit Sharma: మ్యాగీ మ్యాన్ అంటూ రోహిత్ శర్మపై ట్రోల్స్.. కౌంటర్ ఎలా ఇచ్చాడంటే?
Rohit Sharma Faces Maggi Man Trolls

ఇప్పుడంటే రోహిత్ శర్మ (Rohit Sharma) టీమిండియా కెప్టెన్‌గా, ప్లేయర్‌గా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నాడు కానీ.. కెరీర్ ప్రారంభంలో అతను బాడీ షేమింగ్‌కి గురయ్యాడు. అతను బరువుగా ఉండటంతో.. దాన్ని ఉద్దేశించి ట్రోల్స్ చేసేవారు. ఆ విషయాలను టీమిండియా మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ (Abhishek Nair) తాజాగా గుర్తు చేసుకున్నాడు. గతంలో రోహిత్ పొట్టపై ఎన్నో విమర్శలు వచ్చేవని, రెండు నిమిషాల మ్యాగీ మ్యాన్ అంటూ అతనిని దారుణంగా ట్రోల్ చేశారని అన్నారు. అయినా అతను కుంగిపోకుండా.. తన బరువు తగ్గించుకొని, ఫిట్‌గా తయారయ్యి, హిట్‌మ్యాన్‌గా ఎదిగాడని పేర్కొన్నాడు.


Read Also: విరాట్ కోహ్లీ.. దయచేసి ఆ పని చేయకు!

ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిషేక్ నాయర్ మాట్లాడుతూ.. ‘‘2011 వరల్డ్‌కప్‌కు (2011 World Cup) రోహిత్‌ శర్మ ఎంపిక కాలేదు. ఆ సమయంలో రోహిత్ కాస్త అధిక బరువుతో ఉన్నాడు. యువరాజ్‌తో కలిసి అతను ఒక యాడ్‌లో నటించగా.. అందులోని ఓ విజువల్‌ని కట్టి చేసి, రోహిత్ పొట్ట చుట్టూ ఓ గీత గీశారు. అది చూసి బాధేసింది. అప్పుడు రోహిత్ నాతోనే ఉన్నాడు. ఆ యాడ్‌ని చూశాక.. ఫిట్‌నెస్ విషయంలో కొంచెం హార్డ్‌వర్క్ చేయమని సూచించాను. తాను కచ్ఛితంగా మారుతానని రోహిత్ చెప్పాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే అతను హిట్‌మ్యాన్‌గా ఎదిగాడు. తాను ఎలాగైతే ముందుకు సాగాలని అనుకున్నాడో, అందుకు తగ్గట్లే శ్రమించాడు. నా దృష్టిలో ఒక క్రికెటర్ ఇంతలా మారిపోవడం అదే మొదటిసారి. ఎవరైతే తనని మ్యాగీ మ్యాన్ అని ట్రోల్ చేశారో వారికి బ్యాట్‌తోనే రోహిత్ కౌంటర్ ఇచ్చాడు’’ అని చెప్పుకొచ్చాడు.


కాగా.. దేశవాళీ క్రికెట్‌లో ముంబై తరఫున ఆడిన రోహిత్ శర్మ 2007లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఆ టోర్నీలో మెరుగైన ప్రదర్శనే కనబరిచాడు కానీ, ఆ తర్వాత ఫామ్ కోల్పోయాడు. ఫిట్‌నెస్ సమస్యలనూ ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే 2011 వన్డే వరల్డ్‌కప్ టీమ్‌లో స్థానం సంపాదించలేకపోయాడు. దీన్ని సవాల్‌గా తీసుకొని.. తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి, ఎంతో కసరత్తు చేసి తిరిగి గాడిలో పడ్డాడు. అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ తనని ఓపెనర్‌గా అవకాశం ఇవ్వగా.. అదే స్థానంలో అతను పాతుకుపోయాడు. అనంతరం కెప్టెన్ స్థాయికి చేరుకొని.. జట్టుని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 19 , 2024 | 03:21 PM